ఈ వారం ప్రేక్షకుల ముందుకు పలు చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో కేవలం ‘ఆర్ఎక్స్ 100’ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెగా హీరోతో పాటు పలువురు చిన్న పెద్ద హీరోలు వచ్చినా కూడా ఈ వారం ఆర్ఎక్స్ 100 చిత్రం విజేతగా నిలిచింది. కేవలం రెండు రోజుల్లోనే చిత్రం పెట్టుబడిని మరియు డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడిని రికవరీ చేయడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యింది. అందుకు ప్రధాన కారణం ఈ చిత్రంలో యూత్ ఆడియన్స్‌ను అలరించే విధంగా ఉన్న ముద్దు సీన్లు. హీరో కార్తికేయ మరియు హీరోయిన్ పాయల్ల మద్య ఉన్న రొమాంటిక్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఛాన్స్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న పాయల్ ఈ చిత్రంలో తన విశ్వరూపంను చూపించింది.
గ్లామర్ పరంగా పెద్దగా చూపించకున్నా కూడా కార్తికేయతో ఈమె పెట్టిన లిప్‌లాక్ సంచలనం అయ్యాయి. అర్జున్ రెడ్డి సినిమాలోని ముద్దుసీన్స్ కంటే ఈ సీన్స్ మరింత ఘాటుగా, రొమాంటిక్‌గా ఉన్నాయి అంటూ విమర్శకులు సైతం అంటున్నారు. ఇలాంటి సమయంలో హీరోయిన్ పాయల్‌కు మంచి పబ్లిసిటీ దక్కుతుంది. ఈమెకు తెలుగులో వరుసగా చిత్రాల్లో నటించే అవకాశం వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఇక పాయల్ ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం కోసం తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. ఈ చిత్రం కోసం దాదాపు 40 రోజుల డేట్లు ఇచ్చిన పాయల్ కేవలం 6 లక్షల పారితోషికం మాత్రమే అందుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా సక్సెస్ అవ్వడంతో తాజాగా నిర్మాత ఆమెకు పది లక్షల రూపాయలను అందజేసినట్లుగా సమాచారం అందుతుంది. కేవలం ఆరు లక్షల పారితోషికం తీసుకుని ఆరేంజ్‌లో నటించడం, ముద్దులు పెట్టడం పాయల్‌కే చెల్లింది. నెగటివ్ రోల్లో నటించిన పాయల్ నటన పరంగా కూడా మెప్పించింది. మొత్తానికి పారితోషికం చూసుకోకుండా నటించినందుకు పాయల్‌కు మంచి బ్రేక్ దక్కినట్లయ్యింది.