కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రంకు విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఉన్న అంచనాలతో విడుదలకు ముందే రెండున్నర కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పలు ముఖ్య పట్టణాలు మరియు నగరాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. పలు చిత్రాలు విడుదల ఉన్న కారణంగా ఎక్కువ థియటర్లు లభించలేదు. అయినా కూడా ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది.
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మొదటి రోజు ఏకంగా 1.41 కోట్ల షేర్‌ను రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంతో విడుదలైన ‘విజేత’ చిత్రం పెద్దగా మెప్పించలేక పోయింది. దాంతో ఈ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వారాంతం వరకు ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని రాబట్టడంతో పాటు భారీగా లాభాలను కూడా తెచ్చి పెట్టబోతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక ఈ చిత్రం థియేటర్లను పెంచడంతో పాటు, భారీ ఎత్తున శాటిలైట్ రైట్స్‌ను అమ్మేందుకు చిత్ర నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఆర్ఎక్స్ 100 చిత్రం 100 కోట్ల మేరకు నిర్మాతకు లాభాలను తెచ్చి పెట్టే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. అర్జున్ రెడ్డి తరహాలో ఈ చిత్రం బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కింది. ఆ కారణంగానే ఈ సినిమాను యూత్ ఆడియన్స్ విపరీతంగా ఆధరిస్తున్నారు.