గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు చిత్రాల్లో ఆర్ఎక్స్100 చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది. చినబాబు మరియు విజేత చిత్రాలు ప్రేక్షకుల తిరష్కరణకు గురి అయ్యాయి. ముఖ్యంగా విజేత చిత్రం అప్పుడే థియేటర్ల నుండి తొలగించే పరిస్థితి ఉంది. దాంతో పోటీ ఏదీ లేక పోవడంతో ఆర్ఎక్స్ 100 చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది. మొదటి వారంలో ఏకంగా 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను దక్కించుకుని వామ్మో అనిపించిన ఈ చిత్రం ఓవర్సీస్లో కూడా తాజాగా విడుదల అయ్యింది. ఈమద్య చిన్న చిత్రాలకు కూడా భారీ ఎత్తున ఓవర్సీస్లో బిజినెస్ అవుతుంది. ఓవర్సీస్లో ఈ చిత్రం కూడా మంచి వసూళ్లు రాబడుతుందనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన రెండు రోజుల తర్వాత అంటే గత శనివారం ఓవర్సీస్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. వారాంతాల్లో ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం కనీసం లక్ష డాలర్లను కూడా వసూళ్లు చేయలేక పోయింది. దాంతో డిస్ట్రిబ్యూటర్ తీవ్రంగా నిరాశను వ్యక్తం చేస్తున్నాడు. ఓవర్సీస్లో కేవలం ఫ్యామిలీ చిత్రాలకు మాత్రమే మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇందులో ముద్దు సీన్స్, రొమాంటిక్ సీన్స్ శృతిమించి ఉన్న కారణంగా ఈ చిత్రంను అక్కడ ప్రేక్షకులు ఆధరించడం లేదని తేలిపోయింది. ఇప్పటికే అక్కడ ఆర్ఎక్స్ 100 చిత్రంను తొలగించేయాలని నిర్ణయించుకున్నారు.