నటీ నటులు : కార్తికేయ, పాయల్ రాజపుత్, రావు రమేష్, రాంకీ ( సింధూర పువ్వు ఫేమ్ ), సత్య, గిరిధర్, లక్ష్మణ్ తదితరులు.
మ్యూజిక్ : చైతన్ భరద్వాజ్
లిరిక్స్: శ్రీమణి, చైతన్య ప్రసాద్, సిరాశ్రీ
కొరియోగ్రఫీ: స్వర్ణ, అజయ్, సురేష్ వర్మ
స్టంట్స్: రియల్ సతీష్
ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి
ఎడిటర్: ప్రవీణ్. కే .ఎల్ ( కబాలి ఫేమ్ )
సినిమాటోగ్రఫీ: రామ్
పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే
ఎగ్జిక్యూటివ్: సూర్య నారాయణ
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.
సరిగ్గా నెల క్రితం విడుదలైన ‘ఆర్ఎక్స్100’ ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ప్రేమ, శృంగారం, హింస.. ఈ మూడింటిని జోడించి ఒక ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీని తెరకెక్కించారు దర్శకుడు అజయ్ భూపతి. హీరో ఎవరో తెలీదు. హీరోయిన్ మొహం ఇప్పటి వరకూ పెద్దగా ఎవరూ చూసుండరు. కానీ సినిమాపై మాత్రం జనాలకు ఆసక్తి పెరిగిపోయింది. కారణం ‘ఆర్ఎక్స్100’ అనే టైటిల్. దీనికి ‘యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ’ అనే మరో ఆసక్తికర ట్యాగ్ లైన్. చిన్న సినిమానే కానీ ఒక్క ట్రైలర్‌తో అంచనాలు పెరిగిపోయాయి.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన ఈ అజయ్ భూపతికి ఇదే తొలి సినిమా. గురువు బాటలోనే నడుస్తూ వయోలెన్స్, రొమాన్స్‌కు భూపతి పెద్ద పీట వేశారని ట్రైలర్ చూస్తేనే అర్ధం అయిపోతుంది. ప్రేక్షకులకు కేవలం ట్రైలర్‌తోనే సినిమా ఎలా ఉండబోతోందో చూపించేశారు. మొత్తానికి ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఈ సినిమా.. ట్రైలర్లతో ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. హీరోహీరోయిన్లు కార్తికేయ గుమ్మకొండ, పాయల్ రాజ్‌పుత్ కెమిస్ట్రీ సినిమాకు బాగా కలిసొస్తుంది. ఇక రావు రమేష్, రాంకీ లాంటి నటులు మరో బలం. మొత్తానికి ఈ ‘ఆర్ఎక్స్100’ పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. జులై 12న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా ‘విజేత’కు ఏ మాత్రం పోటీ ఇస్తుందో చూడాలి.