Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుందంటూ మెగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయడం లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. త్వరలోనే విడుదల తేదీని వెళ్లడిస్తామని నిర్మాత పేర్కొన్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. కారణంగా రీ షూట్. అవును ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రంలో పలు సీన్స్‌ను రీ షూట్ చేయాల్సి వచ్చిందట. దాదాపు నెలన్నర రోజుల పాటు రీ షూట్‌ను ప్లాన్ చేశారు. అందుకే నవంబర్‌లో ‘జవాన్’ను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.
‘జవాన్’ విడుదల వాయిదా వెనుక ప్రధాన కారణం దిల్‌రాజు అంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సినిమా షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత రషెస్‌ను చూసిన దిల్‌రాజు పలు సీన్స్‌పై అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఒక మంచి కథను ఇలాంటి సీన్స్‌తో భ్రష్టు పట్టించారేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొన్ని ప్రధానమైన సీన్స్‌ను రీ షూట్ చేయడం వల్ల కొద్దిలో కొద్దిగా అయిన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, లేదంటే మొదటి రెండు రోజుల్లోనే సినిమాను తీసేయాల్సి వస్తుందని నిర్మాతలను హెచ్చరించాడట. దాంతో దిల్‌రాజు చెప్పిన రీ షూట్‌కు దర్శకుడు బీవీఎస్ రవి సిద్దం అయ్యాడు. ఈ నెల చివర్లో రీ షూట్‌ను ప్రారంభించనున్నారు. రీ షూట్ కారణంగా దాదాపు మూడు కోట్ల బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని సమాచారం.
మరిన్ని వార్తలు: