శౌర్య నీకిది న్యాయమేనా?

Sai Pallavi Responds Naga Shaurya Comments On Her late to shooting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘ప్రేమమ్‌’ చిత్రంతో మలయాళంలో, ‘ఫిదా’ చిత్రంతో తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయిన సాయి పల్లవి తమిళంలో కూడా వరుసగా చిత్రాలు చేస్తోంది. సాయి పల్లవి నటించిన తెలుగు మరియు తమిళ చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే సాయి పల్లవి గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో హీరో నాగశౌర్య మాట్లాడుతూ ‘కణం’ చిత్రం షూటింగ్‌ సమయంలో ఆమెతో చాలా ఇబ్బంది పడ్డామని, ఆమె టైంకు రాకపోవడంతో పాటు షూటింగ్‌ సమయంలో చిరాకు పెట్టేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలపై ఇన్నాళ్లకు సాయి పల్లవి స్పందించింది. 

నాగశౌర్య తనపై చేసిన విమర్శలు బాధించాయని, ఆ ఇంటర్వ్యూ చూడగానే తాను దర్శకుడు విజయ్‌కు ఫోన్‌ చేసి తన వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అని ప్రశ్నించాను అని, ఆయన లేదని సమాధానం ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చింది. తాను అందరిని ప్రేమిస్తాను అని, అందరితో కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటాను అని, తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే తనకే ఎక్కువ బాధ అవుతుందని చెప్పుకొచ్చింది. ఆయన తన గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతంగా భావించి, గౌరవిస్తాను అని, ఇకపై మరెవ్వరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.