Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాక్షి పత్రిక లో జగన్ ఫోటో వేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించారు. చివరికి ఆ ఫోటో వేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఏమిటా ఫోటో ? అసలు సాక్షిలో జగన్ ఫోటో వేయడానికి అంత ఆలోచిస్తారా ? అనే ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయా ? అయితే ఇదేదో కావాలని చేస్తున్న ప్రచారం కాదు. నిజంగా సాక్షి లో జరిగిన చర్చ. తీసుకున్న నిర్ణయం. దీనికి సంబందించిన విశేషాలు మీకోసం.
ఎన్ టీవీ చౌదరి కుమార్తె వివాహానికి వెళ్లిన వైసీపీ అధినేత జగన్ కి అక్కడ శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఎదురు పడడం, ఆయనకు పాదాభివందనం చేయడం తెలిసిందే. దీనికి సంబంధించి ఫోటోగ్రాఫర్ మూడు ఫోటోలు తీశారు. ఒక దానిలో స్వామీజీకి జగన్ నమస్కారం చేస్తూ వున్నారు. ఇంకో దానిలో స్వామికి జగన్ పాదాభివందనం చేస్తున్నారు. ఇంకో ఫొటోలో జగన్ కి చినజీయర్ స్వామి శాలువా కప్పి ఆశీర్వచనం ఇస్తున్నారు. ఈ మూడింటిలో ఏ ఫోటో సాక్షి లో వేయాలి అనేదానిపై దీర్ఘకాలిక చర్చ సాగింది. కోవిద్ కి జగన్ పాదాభివందనం చేసిన టైం లో వచ్చిన వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకుని తీవ్ర తర్జనభర్జన పడ్డ సాక్షి ఎడిటోరియల్ టీం చివరికి జగన్ కి స్వామి శాలువా కప్పే ఫోటో వేశారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో వచ్చిన ఈ ఫోటో చూసాక అయినా పాదాభివందనం చేస్తున్న జగన్ ఫోటో వేయడానికి సాక్షి మొహమాటపడిందని ఒప్పుకోవాల్సిందే.
మరిన్ని వార్తలు: