జపాన్ లో సల్మాన్ లేటెస్ట్ మూవీ రిలీజ్..!

Salman's latest movie release in Japan..!
Salman's latest movie release in Japan..!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ ల్లో తన అవైటెడ్ సీక్వెల్ మూవీ “టైగర్ 3” కూడా ఒకటి. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి వచ్చిన ఈ మూవీ తమ స్పై యూనివర్స్ లో భాగంగా “పఠాన్”, “వార్” ల తర్వాత వచ్చింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ పరంగా గత రెండు మూవీ ల రేంజ్ లో పెర్ఫామ్ చేయలేదు. దీనితో ఈ మూవీ యావరేజ్ గానే నిలిచిపోయింది .

Salman's latest movie release in Japan..!
Salman’s latest movie release in Japan..!

అయితే మన ఇండియన్ మూవీ లు జపాన్ లో ఎప్పటికప్పుడు ఆనవాయితీగా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అలా ఇప్పుడు టైగర్ 3 కూడా జపాన్ లో రిలీజ్ కు వెళ్లినట్టుగా మేకర్స్ తెలిపారు. అక్కడ ఈ మూవీ హిందీలోనే జపాన్ సబ్ టైటిల్స్ తో విడుదల అయ్యింది. మరి ఈ మూవీ అక్కడ ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. ఇక ఈ మూవీ లో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటించగా మనీష్ శర్మ దర్శకత్వం వహించారు అలాగే ఇమ్రాన్ హష్మి పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించాడు .