Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో మొదటి వారం విజయవంతంగా సాగింది. కొన్ని విమర్శలు, కొన్ని ఫన్నీ గొడవల మద్య బిగ్‌బాస్ షో నడిచింది. మొదటి వారంలో బిగ్‌బాస్ హౌస్ నుండి జ్యోతి తొలగిపోయిన విషయం తెల్సిందే. జ్యోతి తర్వాత స్వయంగా సంపూర్నేష్‌బాబు తొలగి పోవాలని కోరుకుంటున్నాడు. ఇంటికి వెళ్లి పోవాలనే ఉద్దేశ్యంతో అనారోగ్యం అంటూ డ్రామా ఆడుతున్నాడు. గత కొన్ని రోజులుగా సంపూర్నేష్‌బాబు సరిగా తినడం లేదని కూడా హౌస్ మెంబర్స్ అంటున్నారు. అందరు కలిసి ఈ వారంలోనే సంపూను బయటకు పంపిస్తామని హామీ ఇచ్చారు. అందరు కూడా ఈ వారంలో సంపూ నామినేట్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ వారం నామినేషన్ జాబితాలో సమీర్ చేరాడు. దాంతో సమీర్‌తో పాటు మరో నలుగురు నామినేట్ అయ్యే అవకాశం ఉంది.
సంపూర్నేష్‌బాబు ఎట్టి పరిస్థితుల్లో రెండవ వారం తర్వాత హౌస్‌లో కొనసాగను అంటు ఉన్నాడు కనుక బిగ్‌బాస్ హౌస్ నుండి ఆయన్ను ప్రేక్షకులు తీసుకు వస్తారా లేదా అలాగే ఉంచుతారా అనేది చూడాలి. ఇక బిగ్‌బాస్‌లో సంపూ ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయం ఒక వర్గం ప్రేక్షకుల్లో ఉంది. ఆ కారణంగా బిగ్‌బాస్ ఇంట్లో సంపూను ఉంచేందుకు ఎక్కువ మంది మిస్డ్ కాల్స్ ఇస్తారనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి సంపూ ఇబ్బందిగా ఉంటున్నా ఈ వారం తిరిగేలోపు పూర్తిగా ఆయన మారిపోతాడని, మళ్లీ మునుపటి మాదిరిగా షోలో అందరిని అలరిస్తాడని కొందరు భావిస్తున్నారు. సంపూను ఎక్కువ రోజు షోలో చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. కాని సంపూ మాత్రం ఇలా ఆంరభంలోనే వెళ్లి పోవాలని ఉరుకులు పరుగులు పెడుతున్నాడు.
మరిన్ని వార్తలు: