Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బిగ్బాస్ హౌస్ నుండి మొదటి వారం పూర్తిగానే జ్యోతి ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. ఇక రెండవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అంతా ఆసక్తిగా చూస్తున్న సమయంలో సంపూర్నేష్బాబు మద్యలో అర్థాంతరంగా వెళ్లి పోవడం అందరికి షాక్ ఇచ్చింది. హౌస్లో అందరి కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న సెలబ్రెటీ సంపూర్నేష్బాబు. ఆయన వెళ్లి పోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. తన ఊరి వాళ్లు గుర్తుకు వస్తున్నారు, ఈ నాలుగు గోడల మద్య తాను ఉండలేను అంటూ గట్టిగా చెప్పి సంపూర్నేష్బాబు గందరగోళం సృష్టించాడు. దాంతో ఆయన్ను బిగ్బాస్ కన్ఫెషన్ రూంకు పిలిచి ఉండమని చెప్పే ప్రయత్నం చేశాడు. కాని సంపూ మాత్రం తాను ఉండేది లేదు అని తేల్చి చెప్పాడు. దాంతో బిగ్బాస్ సంపూను బయటకు వెళ్లిపోయేందుకు అంగీకరించాడు.
సంపూ బిగ్బాస్ నుండి బయటకు వెళ్లిన నేపథ్యంలో ఆయనకు అందాల్సిన పారితోషికం అందకపోవడంతో పాటు, చట్టపరమైన చిక్కులు సంపూకు తప్పవు అని అంటున్నారు. బిగ్బాస్ షోలో పాల్గొనేందుకు ముందే సంపూర్నేష్బాబుతో స్టార్ మాటీవీ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం బిగ్బాస్ షోలో ఎలిమినేట్ అయ్యే వరకు ఉండాల్సిందే. అలా కాదని రావాలని భావిస్తే లీగల్ చర్యలు ఉంటాయని ఒప్పంద పత్రంలో పేర్కొనడం జరిగింది. దాన్ని మీరి సంపూ ఇంటి నుండి బయటకు వచ్చాడు. దాంతో సంపూర్నేష్బాబుకు పెద్దగా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే సంపూర్నేష్బాబుకు ఇకపై సినిమాల్లో కూడా చేదు అనుభవమే ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తానికి సంపూ తీవ్ర పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నాడు.
మరిన్ని వార్తలు: