ఎంతో మందిని సాధారణ నటులని స్టార్స్‌ని చేసిన ఘనత బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీది. అయితే ఇన్నాళ్ళు బయట వారిని స్టార్స్ ని చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు తన మేనకోడలు షర్మీన్ సెగల్ ను హీరోయిన్ గా అది కూడా ఒక స్టార్ సరసన వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్దం అవుతున్నారు. మామ డైరెక్టర్ అవడంతో చిన్ననాటి నుండే సినిమాలపై చాలా ఆసక్తిని పెంచుకున్న షర్మీన్ కు భన్సాలీ పూర్తి సపోర్ట్ గా నిలిచాడు. నటనలో మెలుకువలు నేర్పడంతో పాటు దర్శకత్వ శాఖలో కూడా ఆమెను చేర్చుకుని సినిమా మేకింగ్ విషయంలో ఆమెకు అవగాహణ కల్పించాడట.
ఎలా అయినా ఆమెను స్టార్ హీరోయిన్ ని చేయాలనీ ఫిక్సయిన ఆయన కోడలితో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను చేసేందుకు కమిట్ అయినట్లుగా అధికారికంగా ప్రకటించాడు. నిజానికి భన్సాలీ ‘పద్మావత్’ మూవీ తర్వాత మరే సినిమాను ప్రకటించలేదు. ఇటీవలే సల్మాన్ ఖాన్ తో ఒక మూవీని భన్సాలీ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేల సల్మాన్ ఖాన్ తో భన్సాలీ సినిమా ఉంటే అందులో హీరోయిన్ గా షర్మీన్ ఉండే అవకాశం ఉంది. మొదటి సినిమానే సల్మాన్ వంటి సూపర్ స్టార్ తో చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా షర్మీన్ స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అంటూ బాలీవుడ్ మీడియా కూడై కూస్తోంది.