Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం పద్మావతి. రణ్ వీర్ సింగ్ ఇందులో హీరో. చిత్తోర్ రాణి పద్మిణి జీవిత కథ ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్ర విశేషాల కన్నా ఎక్కువగా బాలీవుడ్ లో అందరూ చర్చించుకుంటోంది దీపిక, రణ్‌వీర్ సింగ్ ల మధ్య నడుస్తున్న ప్రేమాయణం గురించి. తమ మధ్య ఉన్న ప్రేమను హీరో హీరోయిన్లు ఇంతవరకూ ధ్రువీకరించలేదు కానీ… సెట్ లోనూ, బయట వారిద్దరూ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే..వారిద్దరూ లవ్వర్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటోంది చిత్ర యూనిట్. ఇటీవలే తన పుట్టినరోజు నాడు కొత్త కారులో దీపికను బయటకు తీసుకువెళ్లాడు రణ్ వీర్.
అంతేకాకుండా రణ్ వీర్ దీపిక ముద్దుపెట్టుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వారి మీద గాసిప్స్ ఇంకా ఎక్కువయ్యాయి. అయితే ఈ గాసిప్స్ తో రణవీర్ కానీ, దీపిక కానీ ఎలాంటి ఇబ్బందీ పడటం లేద2ట… కానీ పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మాత్రం తల పట్టుకుంటున్నాడట. అదేమిటి ఓ సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటే…ఆ సినిమా కు పబ్లిసిటీ మరింత పెరుగుతుంది కదా..దర్శకుడికి దాని వల్ల లాభమే కదా అనుకుంటున్నారా..కానీ పద్మావతికి మాత్రం రణవీర్, దీపిక వ్యవహారం మైనస్ అయితుందేమో అని భయపడుతున్నాడట భన్సాలీ. ఎందుకుంటే పద్మావతిలో రణ్ వీర్, దీపిక మధ్య ఎలాంటి సంభాషణలు, సన్నివేశాలు ఉండవు. సినిమాలో క్యారెక్టర్స్ ఇలా ఉంటే…రియల్ లైఫ్ లో వాళ్లు కలిసి తిరిగితే ఎలా అని భన్సాలీకి కోపం వచ్చేస్తోందట. సినిమా చిత్రీకరణ పూర్తయ్యేవరకు ఇద్దరూ కలిసి తిరగకూడదని ఆంక్షలు కూడా విధించారట.
అయినా వాటిని పట్టించుకుని రణ్ వీర్, దీపిక చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారట. అసలు రణ్ వీర్, దీపిక మధ్య లవ్ స్టోరీ మొదలయిందే సంజయ్ లీలా భన్సాలీ సినిమా రామ్ లీలా నుంచే. ఆ సినిమాలో ఇద్దరూ లిప్ లాక్ లతో రెచ్చిపోయారు. ప్రమోషన్స్ లోనూ రణ్ వీర్, దీపికను బహిరంగంగా అందరిముందే ముద్దుపెట్టుకున్నాడు. సినిమా పబ్లిసిటీ కోసమే సంజయ్ లీలా భన్సాలీ సలహా మేరకు రణ్‌వీర్ , దీపిక ఇలా చేస్తున్నారని అప్పట్లో అందరూ అనుకున్నారు. మరి అప్పుడు ప్రోత్సహించిన భన్సాలీ ఇప్పుడు మరో సినిమా కోసం ఇద్దరినీ ఎడమొహం, పెడమొహంగా ఉండమంటే వారు ఒప్పుకుంటారా..
మహానటిలో ప్రకాశ్ రాజ్ ఎవరు?
ఈ రెండు సినిమాలకు ఇలా కలిసొచ్చింది