Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శశికళ ఈ మధ్య తనను చెన్నై జైలుకి మార్చే ఆలోచనలు చేయొద్దని అనుచరులకు హుకుం జారీ చేశారు. మొదట్లో జైలు మారేందుకు తహతహలాడిన శశి హఠాత్తుగా ప్లేట్ మార్చడం వెనుక కారణాలు ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఇక శశి వదిన ఇళవరసి అయితే బెంగుళూరు, పరప్పన అగ్రహార జైలు జీవితాన్ని తట్టుకోలేక అనారోగ్యం పాలైంది. ఆమె కూడా ఇప్పుడు పూర్తిగా తేరుకుంది. ధైర్యంగా వుంది. ఇంతలో అంత మేజిక్ ఏమి జరిగిందబ్బా అనుకుంటే బాంబు లాంటి వార్త బయటికి వచ్చింది.
కర్ణాటక జైళ్ల శాఖ dig రూప మౌద్గిల్ ఇటీవల ఉన్నతాధికారులకు రాసిన లేఖలో శశికళ గుట్టు విప్పారు. ఆమె ప్రస్తుతం ఉంటున్న పరప్పన అగ్రహార జైలు అధికారి ఒకరు 2 కోట్లు లంచం పుచ్చుకుని జైల్లో శశికి సర్వ సదుపాయాలూ కల్పించారట. ఆమె జైల్లో స్వేచ్ఛగా తిరిగే అవకాశం, ప్రత్యేక వంటగది, పరుపులు, సెల్ ఫోన్స్, ఇలా ఏమి కావాలనుకుంటే అవి శశికి అందుబాటులోకి వస్తున్నాయట. ఇక ఈ సౌకర్యాలన్నీ శశి వదిన ఇళవరసి కూడా అనుభవిస్తోంది.
ఒకప్పుడు నకిలీ స్టాంపుల కుంభకోణంలో దోషిగా తేలి ఇదే జైల్లో 15 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న తెల్గీ కూడా ఇదే స్టైల్ లో సర్వ సౌఖ్యాలు పొందుతూ రాజభోగాలు అనుభవిస్తున్నాడట. అతనికి మసాజ్ చేయడానికి నలుగురు ఖైదీలు పని చేస్తారట. గంజాయి కూడా వస్తోందట. వీరికి పరప్పన జైల్లో ఇన్ని సదుపాయాలూ కల్పిస్తున్న సత్యనారాయణ రావు అనే ఉద్యోగి మాత్రం అయ్యో లంచమా నేనెరుగ అంటున్నారు. కానీ రూప లేఖని సీరియస్ గా తీసుకున్న కర్ణాటక జైళ్ల శాఖ మాత్రం పరప్పన జైలు మీద స్పెషల్ గా దృష్టి పెట్టింది. ఈ వ్యవహారం ముందుకు వెళితే శశికి మళ్లీ చెన్నై జైలు ఆలోచనలు తప్పవేమో.
మరిన్ని వార్తలు