Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలు ఉన్నంత కాలం హీరోయిన్ సావిత్రి పేరును మర్చిపోలేం. అంతటి పేరును దక్కించుకున్న సావిత్రి జీవిత కథ ఆధారంగా యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ‘మహానటి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా ‘మహానటి’ ప్రాజెక్ట్ గురించిన వర్క్ జరుగుతుంది. ఎట్టకేలకు మార్చి చివర్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. సావిత్రి జీవిత చరిత్ర అనగానే ఎక్కువ శాతం మంది ఆమె ఎలా చనిపోయింది, చివరి దశలో ఆమె ఎందుకు మద్యంకు అలవాటు పడ్డారు అనే విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. ఇంత కాలం సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటికి ‘మహానటి’లో సమాధానం లభిస్తుందని అంతా భావించారు. అందుకే ‘మహానటి’ చిత్రంపై సినీ వర్గాల వారు కూడా ఆసక్తిని కనబర్చుతున్నారు.
చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘మహానటి’ చిత్రంలో ప్రేక్షకులు ఆశిస్తున్న విషయాలను చూపించబోవడం లేదని తెలుస్తోంది. సావిత్రి చివరి దశలో తాగుడికి బానిస అవ్వడం, ఆమె దారుణంగా చనిపోవడంతో పాటు చాలా విషయాలు ఉన్నాయని, సావిత్రి సంతోషమయ జీవితాన్ని చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. సావిత్రి తన భర్తతో ఉన్న విభేదాల కారణంగా మద్యంకు బానిసైనట్లుగా కొందరు అంటారు. అయితే ఆ విషయాన్ని కూడా మహానటిలో చూపించబోవడం లేదు. సావిత్రి, గణేషన్‌ను వివాహం చేసుకున్న వరకే చూపిస్తారట. ఇక సావిత్రి జీవిత చరిత్ర చిత్రం దు:ఖంతో కాకుండా సంతోషంగా ముగుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ముందే హింట్ ఇస్తున్నారు. అంటే సావిత్రి చనిపోయేంత వరకు ‘మహానటి’ సాగదని, హీరోయిన్గా ఆమె స్టార్డం తెచ్చుకునే వరకు మాత్రమే ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్క్రీన్‌ప్లే చాలా విభిన్నంగా ఉంటుందని, సమంత పాత్రతో సావిత్రి జీవిత చరిత్ర చెప్పిస్తూ, రెండు కథలు సమాంతరంగా నడిచేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.