అర్జున్‌ రెడ్డి వెంట పడుతున్న శేఖర్‌ కమ్ముల

sekhar kammula next movie with Vijay Devarakonda

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఒక్కసారిగా అందరికి విజయ్‌ దేవరకొండ పరిచయం అయ్యాడు. ఆ చిత్రం తర్వాత ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాన్ని చేసి స్టార్‌ అయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండ స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలువురు నిర్మాతలు మరియు దర్శకులు విజయ్‌ దేవరకొండ వెంట పడుతున్నారు. ప్రస్తుతం అల్లు అరవింద్‌ బ్యానర్‌లో ఒక చిత్రాన్ని చేస్తున్న విజయ్‌ ఆ తర్వాత పలు చిత్రాలను చేసేందుకు కమిట్‌ అయినట్లుగా సమాచారం అందుతుంది. ఇటీవలే నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు విజయ్‌ దేవరకొండ ఓకే చెప్పాడు అంటూ ప్రచారం జరుగుతుంది. నందిని రెడ్డి చెప్పిన కథకు ఓకే చెప్పిన విజయ్‌ తాజాగా మరో దర్శకుడి దర్శకత్వంలో కూడా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Sekhar-Kammula

‘ఫిదా’ చిత్రంతో సాలిడ్‌ సక్సెస్‌ను అందుకున్న శేఖర్‌ కమ్ముల మరో మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. తన రూటును మార్చి రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలను చేస్తున్న దర్శకుడు శేఖర్‌ కమ్ముల ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ‘ఫిదా’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు శేఖర్‌ కమ్ముల తర్వాత సినిమాను షురూ చేయలేదు.

Vijay-Devarakonda

ప్రస్తుతం ఒక కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. ఆ కథకు విజయ్‌ దేవరకొండ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆయన్ను సంప్రదించడం, విజయ్‌ దేవరకొండ వెంటనే ఓకే చెప్పడం జరిగిందట. వీరిద్దరి కాంబో మూవీ ప్రారంభం అవ్వడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం చివర్లో సినిమా వచ్చేలా శేఖర్‌ కమ్ముల ప్లాన్‌ చేస్తున్నాడు. అర్జున్‌ రెడ్డి మరోసారి ఫిదా చేస్తాడా అనేది చూడాలి.