టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ గురించి రోజుకు ఒక్కో హీరోయిన్ ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ ఆమని ఈ విషయమై స్పందించింది. తాము హీరోయిన్గా ఉన్న సమయంలో కాస్టింగ్ కౌచ్ లేదని, అయితే కొందరు కొత్త నిర్మాణ సంస్థలు పెట్టి, సినిమాలు నిర్మిస్తాం అంటూ అమాయకపు అమ్మాయిలను మోసం చేయడంతో పాటు, కొంత మంది నుండి డబ్బు లాగేవారు అంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో కథ చర్చలకు గెస్ట్‌హౌస్‌కు రమ్మని పిలిచారు అంటే అదే కారణం అనే టాక్ ఉండేది. అమాయకపు అమ్మాయిలు కొందరు అవకాశాల కోసం అప్పట్లో గెస్ట్ హౌస్‌కు వెళ్లే వారు అంటూ చెప్పుకొచ్చింది. సినిమా పరిశ్రమలో ట్యాలెంట్ ఉన్న వారిని ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయంటూ పేర్కొంది.
ఆమని ఇంకా మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న కాస్టింగ్ కౌచ్ విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, అమ్మాయిల బలహీనతలను అవతలి వారు అలుసుగా తీసుకుని, వారిని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆమని వ్యాఖ్యలు చేసింది. వరుసగా సినిమాల్లో నటించాలని కోరుకునేవారు, కాస్టింగ్ కౌచ్‌కు బలి అవుతున్నారని ఆమని చెప్పుకొచ్చింది. ఇక తన రెండవ ఇన్నింగ్స్ సంతృప్తికరంగా సాగుతుందని, సీనియర్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రాకున్నా కూడా మంచి పాత్రలు తనకు దక్కుతున్నాయంటూ చెప్పుకొచ్చింది. ఇకపై వరుసగా చిత్రాలు చేయాలని భావిస్తున్నట్లుగా ఆమని అంటోంది. గతంలో హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమని ప్రస్తుతం హీరో లేదా హీరోయిన్స్‌కు అమ్మగా లేదా ముఖ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపిస్తూ వస్తుంది.