తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ శాతం హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ గురించి ఈమద్య మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటి నుండో ఈ జాడ్యం సినిమా పరిశ్రమలో ఉందని, కొందరు నీచులు తమ అవసరాల కోసం అమాయకపు అమ్మాయిలను వాడుకున్నారు అంటూ పలువురు హీరోయిన్స్ ఇప్పటి వరకు వాదించారు. తాజాగా ఈవిషయమై సీనియర్ హీరోయిన్ జయప్రద మాట్లాడుతూ తాను చిన్నతనంలోనే ఉండగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాను. చేసిన ప్రతి సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో నాకు ఎప్పుడు కూడా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు. అందుకే కాస్టింగ్ కౌచ్ అనుభవం తనకు ఎదురు కాలేదు అంటూ చెప్పుకొచ్చింది.
కాస్టింగ్ కౌచ్ గురించి జయప్రద ఇంకా మాట్లాడుతూ.. అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ ఉండటం బాధాకరం. అయితే కాస్టింగ్ కౌచ్‌కు ముఖ్య కారణం ముంబయికి చెందిన అమ్మాయిలు అనేది తన అభిప్రాయం. ఎందుకంటే వారు అవకాశాల కోసం దర్శకుల మరియు నిర్మాతల కోరికలు తీర్చేందుకు కూడా సిద్దంగా ఉంటారు. వారు ఇచ్చిన అలుసుతో అందరిని కూడా దర్శక నిర్మాతలు వాడేసుకోవాలని భావిస్తూ ఉంటారు. అందుకే ఇంతగా కాస్టింగ్ కౌచ్ పెరిగి పోయిందని అంటున్నారు. అమ్మాయిలు ఎలాగైనా సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో కొన్ని హద్దులను చెరిపేసుకుంటున్నారు అంటూ జయప్రద చెప్పుకొచ్చింది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలని, అన్ని ఉన్నా కూడా అవకాశాలు రానప్పుడు కాస్టింగ్ కౌచ్‌కు కూడా సిద్దం అవుతున్నారు అంటూ జయప్రద తన అభిప్రాయంను వ్యక్తం చేసింది.