టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నటుడు బాబు మోహన్ ఆ పార్టీ కి భారీ షాక్ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. ఆయన ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరనున్నట్లు తెలుస్తోంది.
తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలోని తన సిట్టింగ్ స్థానమైన అందోల్ నియోజకవర్గం నుంచి మరోసారి టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన బాబు మోహన్ ఈరోజు ఉదయం తెలంగాణ బీజేపీ చీఫ్ కె.లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలోకి చేరనున్నట్టుసమాచారం.