దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. ఉగ్రవాదులు టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి పేలుళ్లు సృష్టించారు. ఈ బాంబు పేలుడు కేసులో కీలక సూత్రధారిగా ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడుగా యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడు.