జబర్దస్త్ కమెడియన్ షకక శంకర్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ‘శంభో శంకర’ చిత్రంతో శంకర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేడు సినిమా విడుదల అవుతుంది. ఇక ఈ చిత్రం కోసం షకలక శంకర్ చాలా కష్టపడ్డట్లుగా సినిమా ట్రైలర్ మరియు టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్‌ను దించేసేందుకు ఈయన విపరీతంగా కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ మ్యానరిజంను బాగా ప్రాక్టీస్ చేసి ఈ చిత్రంలో శంకర్ చూపించాడు. ఈ చిత్రం కోసం దాదాపు 50 రోజుల పాటు శంకర్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం కోసం శంకర్ తీసుకున్న పారితోషికం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత చిన్న హీరో అయినా తక్కువలో తక్కువగా 30 లక్షల పారితోషికం అందుకుంటున్నారు. కాని ‘శంభో శంకర’ చిత్రం కోసం శంకర్ కేవలం 15 లక్షల పారితోషికంనే తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. సినిమాపై ఇష్టంతో, కథను నమ్మి, తక్కువ పారితోషికంతో ఈ చిత్రంను చేసినట్లుగా ఆయన చెబుతున్నాడు. కథపై నమ్మకంతో ఈ చిత్రం చేయడం వల్ల తనకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో తక్కువ పారితోషికం అయినా ఇష్టంతో చేశాను, సినిమా ఫలితం తప్పకుండా తనకు పారితోషికానికి మించి ఫలితం ఇస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేస్తున్నాడు. రోజుకు 13 వేల చొప్పునే తీసుకుని ఈ చిత్రంలో నటించినట్లుగా తెలుస్తోంది. ఇత తక్కువ పారితోషికం తీసుకున్న హీరోగా షకలక శంకర్ రికార్డు సాధించాడు. తక్కువ పారితోషికం హీరోగా ఈయన నిలిచిపోయాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు కూడా అంటున్నారు.