సౌత్ ఆడియన్స్‌కు షకీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుత యూత్ ఆడియన్స్ విషయం పక్కన పెడితే కాస్త సీనియర్ అదే 30 నుండి 40 ఏళ్ల మద్య ఉన్న ప్రేక్షకులకు షకీలా గురించి అస్సలు పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం సన్నీలియోన్ ఏ రేంజ్‌లో యూత్‌ను ఎట్రాక్ చేస్తుందో రెండు దశాబ్దాల క్రితం షకీలా ఆ స్థాయిలో యూత్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. షకీలా సినిమా అంటే కలెక్షన్స్ జల జలా రాలేవి. మలయాళ స్టార్ హీరోల నుండి ఎంతో మంది సౌత్ హీరోలు కూడా ఈమె సినిమా విడుదల అయితే కనీసం రెండు మూడు వారాల వరకు తమ సినిమాలను విడుదల వాయిదా వేసుకునేవారు. అంతటి క్రేజ్ ఉన్న షకీలా బయోపిక్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన జీవితంలో జరిగిన చికటి సంఘటనలను కూడా సినిమాలో చూపించబోతున్నట్లుగా షకీలా చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ నటి రిచా చద్దా ఇప్పటికే షకీలా పాత్రకు ఓకే చెప్పింది. షకీలా జీవితం గురించి తెలుసుకుంటుంది. గతంలో షకీలా నటించిన చిత్రాలను రిచా చద్దా చూస్తూ ఉంది. ఇక ఈ చిత్రంలో మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు మరియు దర్శకుల బతుకుల అసలు రంగును బయట పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. షకీలా స్టార్‌గా ఉన్న సమయంలో కొందరు స్టార్ హీరోలు ఆమెను తొక్కేసేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేశారు. సీఎంను కూడా కలిసి షకీలా గురించి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వారితో పాటు ఇంకా పలువురు సౌత్ దర్శకులు కూడా షకీలాతో ఆడుకునేందుకు ప్రయత్నించారు. వారందరిని కూడా తన సినిమాలో బయట పెట్టాలని షకీలా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం షకీలా ఆర్థికంగా శారీరకంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఆమెకు ఈ పరిస్థితి రావడానికి కూడా కొందరు కారణం. వారిని కూడా సినిమాలో చూపించబోతుంది. మొత్తానికి కొందరి జీవితాలను రోడ్డున పడేసేందుకు షకీలా ఈ బయోపిక్‌ను వినియోగించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.