Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని గందరగోళంలో పడేశారని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఆరోపించినప్పుడు ఆయనకు మద్దతుగా బీజేపీ లో గొంతు వినిపించిన ఏకైక నేత శతృఘ్న సిన్హా. దేశ ఆర్థిక స్థితిపై యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలు నిజమేనని, దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని శతృఘ్న సిన్హా డిమాండ్ చేశారు. తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు మరోమారు ప్రధాని మోడీ, ఆయన క్యాబినెట్ లోని ఇతర మంత్రులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో ఒక వకీల్ బాబు ఆర్థిక మంత్రి అయ్యారని అరుణ్ జైట్లీని ఉద్దేశించి వ్యాఖ్యానించిన శతృఘ్న, టీవీ నటి కేంద్రమంత్రి అయ్యారని స్మృతి ఇరానీపై వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే ఓ ఛాయ్ వాలా… అంటూ ప్రధాని గురించి ఏదో మాట్లాడబోయి అంతలోనే వెనక్కితగ్గి మౌనంగా ఉండిపోయారు. ఈ విషయం గురించి తాను పూర్తిగా మాట్లాడదల్చుకోలేదని, అయితే దేశ ఆర్థిక పరిస్థితులపై తాను ఎందుకు మాట్లాడకూడదని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకం ప్రారంభోత్సవానికి హాజరైన శతృఘ్న సిన్హా ఈ వ్యాఖ్యలు చేశారు.