Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జపాన్ ప్రధానిగా షింజో అబేకు మరోసారి అవకాశం లభించింది. సార్వత్రిక ఎన్నికల్లో అబే నేతృత్వంలోని పాలక కూటమి ఘన విజయం సాధించింది. పార్లమెంట్ దిగువ సభలో మొత్తం 465 మంది సభ్యులు ఉండగా..షింజో అబే నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమికి 312 స్థానాలు లభించాయి. ఉత్తరకొరియా వివాదం సహా, కీలకమైన విషయాల్లో గట్టి నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్న షింజో అబే… ప్రజల మద్దతు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ప్రజలు ఘనవిజయం అందించారు.
అబే గెలుపుపై భారత ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతం అయ్యేందుకు అబే గెలుపు ఉపకరిస్తుందని మోడీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఘనవిజయాన్ని సాధించిన స్నేహితుడు షింజో అబేకు శుభాకాంక్షలని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గత నెలలో షింజో అబే భారత్ లో పర్యటించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు శంకుస్థాపన సహా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షింబే అబే ప్రధాని అయిన తరువాత… భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయి.