బిగ్‌బాస్ సీజన్ 2 ఆసక్తికరంగా సాగుతుంది. గొడవలు, మనస్పర్థలు, ఈర్శ్య ద్వేశాతో రెండవ సీజన్ సాగుతోంది. ఎంత గేమ్‌లను ఆసక్తికరంగా పెట్టినా కూడా బిగ్‌బాస్‌కు మొదటి సీజన్‌కు వచ్చినంత టీఆర్పీ రేటింగ్ రెండవ సీజన్‌కు రావడం లేదు. ఇలాంటి సమయంలోనే బిగ్‌బాస్ గెస్ట్‌లను ఇంట్లోకి ప్రవేశ పెడుతున్నాడు. గత వారంలో యాంకర్ ప్రదీప్ బిగ్‌బాస్ ఇంటికి రావడం, ఆ సమయంలో భారీ టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. అందుకే మరో గెస్ట్‌ను ఇంట్లోకి తీసుకు వచ్చేందుకు షో నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్‌బాస్ మొదటి సీజన్లో విజేతగా నిలిచిన శివ బాలాజీని గెస్ట్‌గా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శివబాలాజీ మొదటి సీజన్లో మంచి ఆట తీరును ప్రదర్శించడంతో పాటు, అందరి ప్రశంసలను అందుకున్నాడు. అందుకే ఆయనకు ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటం జరిగింది. అందుకే ఆయన్ను రెండవ సీజన్లో గెస్ట్‌గా ఇంట్లోకి పంపిస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వచ్చే వారంలో ఏదైనా ఒక రోజున బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుందని, అందుకు మీరు సిద్దంగా ఉండాలి అంటూ శివబాలాజీకి బిగ్‌బాస్ నిర్వాహకులు సూచించినట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో డేట్‌ను ఫిక్స్ చేస్తామని నిర్వాహకులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒక్కరోజు పాటు షోలో శివబాలాజీ గడపబోతున్నాడు. మద్యాహ్నం 12 గంటలకు వెళ్లి రాత్రి వరకు అక్కడే ఉంటాడని సమాచారం అందుతుంది. అందుకు గాను శివబాలాజీకి భారీ మొత్తంలోనే చెల్లించే అవకాశం కనిపిస్తుంది. మరో వైపు బిగ్‌బాస్‌లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్‌లో ఒకరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.