శ్రేయ పెళ్లి వీడియో మరియు పెళ్లి ఫొటోస్… వైరల్

Shriya Saran marriage Video

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌ముఖ న‌టి శ్రేయ పెళ్లి ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఉత్త‌రాది సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి పెళ్లి జ‌రిగిన‌ట్టు ఫొటో చూస్తే అర్ధ‌మ‌వుతోంది. శ్రేయ ఎరుపురంగు డ్రెస్ లో, ఆమె భ‌ర్త ఆండ్రీ కోశ్చీవ్ బ్లూ క‌ల‌ర్ షేర్వాణిలో మెరిసిపోతున్నారు. ఫొటోలో శ్రేయ భ‌ర్త చేయిప‌ట్టుకుని న‌వ్వుతూ సంతోషంగా క‌నిపిస్తోంది. ముంబైలో కుటుంబ‌స‌భ్యులు, అతికొద్దిమంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి పెళ్లి జ‌రిగింది. ర‌ష్యాకు చెందిన వ్యాపార‌వేత్త అయిన ఆండ్రీ కోశ్చీవ్, శ్రేయ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

అయితే శ్రేయ త‌న ప్రేమ విష‌యం ర‌హ‌స్యంగా ఉంచింది. రెండునెల‌ల క్రితం వ‌ర‌కు శ్రేయ ప్రేమ విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. భారీగా షాపింగ్ చేస్తుండ‌డంతో శ్రేయ ప్రేమ‌, పెళ్లి వ్య‌వ‌హారం బ‌య‌టికివ‌చ్చింది. ద‌క్షిణాదితోపాటు ఉత్త‌రాదిలోనూ గుర్తింపు తెచ్చుకున్న శ్రేయ పెళ్లికి ఎవ‌రినీ పిల‌వ‌కుండా ర‌హ‌స్యంగా చేసుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పెళ్లి త‌ర్వాత కూడా శ్రేయ సినిమాల్లో న‌టించ‌నుంది.తెలుగులో ప్ర‌స్తుతం ఆమె వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు చిత్రంలో న‌టిస్తోంది.

Sriya Marriage 2 Sriya marriage -3

Sriya Marriage