హీరో సిద్దార్థ తమిళ సినిమా ఇండస్ట్రీస్ నుండి తెలుగులో కి వచ్చి నువోస్తానంటే నేనోద్దంటానా, బొమ్మరిల్లు, యువ, ఇలాంటి సూపర్ హిట్ట్ చిత్రలో నటించి మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆ తరువాత వచ్చిన సినిమాలు సిద్దార్థ్ ను హీరోగా నిలబెట్టలెకపోయాయి. తెలుగు నుండి మకాం తమిళనాడుకు మార్చాడు అక్కడ సినిమాలో నటిస్తూ రానిస్తున్నాడు. ఆ మద్య తమిళంలో వరస పరాజయాలు వెంటాడుతున్నాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
తాజాగా సిద్దార్థ్ ఓ హింది మూవీ పైన మనసు పారేసుకున్నాడు. అదే బాలీవుడ్ లో వచ్చిన “అంధధూన్” ఈ చిత్రం 30 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై మంచి విజయాని నమోదు చేసుకుంది. ఈ చిత్రంలో టాబు… రాధిక ఆప్టేలు నటించారు. కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు ఈ చిత్రాని తమిళంలో రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రీమేక్ మూవీలో హీరో సిద్దార్థ్ నటిస్తున్నాడు. మిగతా వివరాలు త్వరలోనే తెలుస్తాయి అంటున్నారు తమిళ చిత్ర బృందం