Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ లో శ్రీ రెడ్డి ప్రకంపనలు అంతా ఇంతా కాదు. తనకి ఇండస్ట్రీ లో అన్యాయం జరిగిందని పోరాటం మొదలు పెట్టిన ఆమె మా అసోసియేషన్ బయట అర్దనగ్న ప్రదర్శన చేసే వరకు వెళ్ళింది. అయితే ఆమె పోరాటం క్రమంగా పక్కదారి పట్టి పవన్ మీద వ్యక్తిగత దూషణలు చేసే వరకు వెళ్ళింది. అయితే దీని మీద పవన్ స్పందించలేదు కానీ పవన్ అభిమానులు, మెగా ఫ్యామిలి హీరోలు స్పందించారు. అయితే ఈ క్రమంలో శ్రీ రెడ్డి ఓ ట్విస్ట్ బయట పెట్టింది, వర్మ అనమంటేనే తానూ ఆ అసభ్య పదం వాడానని ఆమె ప్రకటించింది. ప్రకటన అయితే ఇచ్చింది కాని ఆమె చెప్తున్న విషయం మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి నిజాలు నిగ్గు తేల్చాలి అని భావిస్తున్న సమయంలో శ్రీరెడ్డి పై నటుడు శివబాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
శ్రీరెడ్డి క్షమాపణ చెప్పినా పవన్ కళ్యాణ్ అబిమానుల ఆగ్రహం చల్లారడం లేదు. వ్యక్తిగత దూషణలకు దిగిన ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, పవన్ కల్యాణ్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడమేంటని శివబాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో సూచించారు. వృత్తిపరంగా నటుడిని… అంతేకాకుండా పవన్ కల్యాణ్ అభిమానిని. ఆయనతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏప్రిల్ 16వ తేదీన 5 గంటల ప్రాంతంలో నా ఇంట్లో టీవీ చూస్తుండగా… ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌పై దారుణంగా కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. నాలాంటి అభిమానిని తట్టుకోలేని విధంగా ప్రవర్తించిందన్నారు.
పవన్ కల్యాణ్‌ను, ఆయన తల్లిని అత్యంత దారుణమైన, నీచమైన పదజాలంతో తిట్టింది. కొందరు రాజకీయ నేతల అండదండలతోనే శ్రీరెడ్డి తిట్టిందని తెలుసుకొన్న నేను చాలా షాక్‌కు గురయ్యాను. జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కల్యాణ్‌ను, ఆయన ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడానికే ఈ కుట్ర చేశారని శివ బాలాజీ పేర్కొన్నారు. ఆమె వాడిన నీచమైన పదజాలం మహిళల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని, శ్రీరెడ్డి వ్యాఖ్యలు ప్రజల శాంతికి చేటు కలిగే విధంగా ఉంది. శ్రీరెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ శాఖను కోరుకొంటున్నాను అని శివ బాలాజీ ఫిర్యాదులో తెలిపారు. అయితే పవన్‌పై శ్రీరెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు స్పష్టమైన విషయం తెలిసిందే. ఆయనపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.