సోషల్‌ మీడియాలో మహేష్‌ను ఆడేసుకుంటున్నారు

social-media-trolls-viral-on-mahesh-flop-movies-and-directors

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్పైడర్‌’ చిత్రానికి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా సాదా సీదాగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. రివ్యూలు నెగటివ్‌గా వచ్చాయి. దాంతో కలెక్షన్స్‌ చాలా డల్‌గా ఉన్నాయి. ఈ చిత్రం విడుదలకు ముందు మహేష్‌బాబు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తారా స్థాయిలో ప్రచారం చేశారు. స్పైడర్‌ చిత్రం రికార్డులు బ్రేక్‌ చేయడం ఖాయం అని, మెగా, నందమూరి అభిమానులు మూసుకోవాల్సిందే అంటూ ఎన్నో ట్వీట్‌లు చేశారు. సినిమా విడుదల వరకు కామ్‌గా ఉన్న మెగా ఫ్యాన్స్‌ స్పైడర్‌ థియేటర్లకు వచ్చి రాగానే నెగటివ్‌ ప్రచారం మొదలు పెట్టారు. సినిమాకు వచ్చిన టాక్‌ను స్రెడ్‌ చేయడం ప్రారంభించారు.

సోషల్‌ మీడియాలో స్పైడర్‌ చిత్రంపై ఒక రేంజ్‌లో ఆడేస్తున్నారు. యాంటీ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ స్పైడర్‌ను ట్రోల్‌ చేస్తున్న విధానం మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు. మహేష్‌బాబు ఒక గొప్ప దర్శకుడికి ఫ్లాప్‌ ఎలా ఉంటుందో రుచి చూపించాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాటమరాయుడును మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అయ్యేలా మరీ ట్రోల్‌ చేశారు. అలాగే మహేష్‌బాబు స్పైడర్‌ సినిమాను కూడా అలాగే ట్రోల్‌ చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ టైటిల్‌కు మహేష్‌బాబు అర్హుడు కాదు అంటూ కొందరు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు.

ఇక ఒక పోస్ట్‌ ఎక్కువగా వైరల్‌ అవుతుంది. అదేంటి అంటే ఇప్పటి వరకు ఫ్లాప్‌ల మొహం కూడా చూడని దర్శకులకు మహేష్‌బాబు ఫ్లాప్‌లు ఇచ్చి చూపించాడు. కెరీర్‌లో ఒక్క సినిమా తప్ప త్రివిక్రమ్‌ అన్ని సూపర్‌ హిట్‌ చిత్రాలు చేశాడు. ఆ ఒక్కటి ‘అతడు’. ఫ్లాప్‌ ఎలా ఉంటుందో త్రివిక్రమ్‌కు ‘అతడు’ చిత్రంతో మహేష్‌బాబు రుచి చూపించాడు. ఎన్నో అద్బుతమైన సినిమాలు చేసిన శ్రీనువైట్లను ‘ఆగడు’ చిత్రంతో నాశనం చేశాడు. మంచి విభిన్న చిత్రాలను అందించిన సుకుమార్‌కు ‘నేనొక్కడినే’ అంటూ ఫ్లాప్‌ ఇచ్చాడు. ఇక సౌత్‌ ఇండియాలోనే గ్రేట్‌ దర్శకుడిగా పేరున్న మురుగదాస్‌కు ఇప్పుడు ‘స్పైడర్‌’ చిత్రంతో ఫ్లాప్‌ను రుచి చూపించిన మహేష్‌బాబు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.