Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విమానయానం ఆకర్షణీయంగా కనిపించినా.. లోటుపాట్లు మాత్రం చాలానే ఉన్నాయి. ట్రావెల్స్ బస్సు మధ్యలోనే ఆగిపోతే ప్రయాణికులు అష్టకష్టాలు పడతారు. అలాంటిది విమానంలో పదహారు గంటల పాటు ప్రయాణికులు నరకం చూశారంటే ఇంకేమనుకోవాలి. చెన్నై ఎయిర్ పోర్టులో సౌదీ ఎయిర్ లైన్స్ నిర్వాకానికి ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొచ్చి మీదుగా రియాద్ వెళ్లాల్సిన సౌదీ ఎయిర్ లైన్స్ విమానం చెన్నై నుంచి బయల్దేరింది. అంతా అనుకున్నట్లుగాటేకాఫ్ అయినా. కొచ్చి సమీపంలోకి వచ్చేసరికి సుడిగాలులు మొదలయ్యాయి. దీంతో రిస్క్ అవుతుందని భావించిన పైలట్.. విమానాన్ని తిరిగి చెన్నై తీసుకొచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఎంతసేపైనా చెన్నై నుంచి ఫ్లైట్ బయల్దేరకపోవడం ప్రయాణికుల్ని నిస్సత్తువలో ముంచేసింది.
మూడు గంటల్లో పైలట్ వస్తాడని చెప్పిన సిబ్బంది.. తర్వాతి రోజు ఉదయం కానీ విమానం టేకాఫ్ కాలేదు. దించేస్తే తమ దారి తాము చూసుకుంటామని ప్రయాణికులు బతిమాలినా సిబ్బంది కనికరించలేదు. కొచ్చిలో చెకింగ్ తర్వాత దిగిపోమని ఓ ఆఫర్ మాత్రం పడేశారు. మధ్యలో గొడవ చేస్తే తిండిపెట్టారు అంతే. ఈ మాత్రం ప్రయాణానికి ఫ్లైట్ ఎందుకని షిప్ లో వెళ్లినా వెళ్లేవాళ్లమని ప్రయాణికులు నిట్టూర్చారు.
మరిన్ని వార్తలు: