శ్రీరెడ్డి మరో ‘ఛీ’ కొట్టే పోస్ట్…ఈ సారి తమిళ హీరో మీద !

Sri reddy comments on director murugadoss And Tamil Star Srikanth

టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకులపై క్యాస్టింగ్ కౌచ్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించిన శ్రీరెడ్డి గతకొంతకాలంగా సైలెంట్ ఉంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరిట తనకు ఎదురైన చేదు అనుభవాలను, అందుకు కారకులైన కొందరు ప్రముఖులను ఒక్కొక్కరిగా ఏకిపడేస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు తన టార్గెట్టును తమిళ ఇండస్ట్రీపైకి మళ్లించింది. ఇప్పుడు ఓ హీరోని తగులుకుంది. ఆ హీరో ఎవరో కాదు, శ్రీకాంత్‌ అలియాస్‌ శ్రీరామ్‌, శ్రీ రామ్ తెలుగోడే కానీ, తమిళంలో స్థిరపడ్డాడు. ఇప్పుడీ హీరోని తన ‘ఛీ లీక్స్‌’లోకి లాగేసింది శ్రీరెడ్డి. శ్రీరామ్‌ ఓ హోటల్‌లో తనతో కలసి ఎంజాయ్‌ చేశాడనీ, అవకాశాలిస్తానని మోసం చేశాడనీ పేర్కొంది. మేము కూడా రాయలేని పదజాలంతో ఆయన పై ధూషణలు చేసింది. ఐదేళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన శ్రీకాంత్ ఆ తర్వాత తనతో అతడు ఎంజాయ్ చేశాడంటూ దారుణమైన పదజాలం వుపయోగించింది. నువ్వు నా ***** తిన్న స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం చాలా నిర్లజ్జగా పోస్ట్ చేసింది.

శ్రీకాంత్‌ ఫోటో, పేరు విడుదల చేస్తూ ఈ అసభ్యకరమైన స్టోరీ అల్లింది శ్రీరెడ్డి. ఇక్కడ ఛీ లీక్స్ అని ఎందుకు అన్నాము అంటే ఒక స్త్రీ మాట్లాడాల్సిన మాటలు ఎంత మాత్రమూ కావివి. ఇదొక్కటే కాక సౌతిండియా స్టార్ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్ పైనా సంచలన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌ డైరెక్టర్‌ మురగదాస్ తనకు అవకాశాలిస్తానని చెప్పి మోసగించాడనీ, హాయ్‌ మురుగదాస్‌ అంటూ మొదలెట్టిన శ్రీరెడ్డి గ్రీన్‌ పార్క్‌ హోటల్‌ విషయం మీకు గుర్తుందా అంటూ బాంబు పేల్చారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ ద్వారా మనం కలిశామని, తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారని మురుగదాస్‌కు గుర్తుచేశారు. ఆ రోజు హోటల్‌లో మనం చాలా…… అంటూ అసంపూర్తిగా వ్యాఖ్యాన్ని ముగించింది. ఇప్పటి దాకా తెలుగు ఆర్టిస్ట్స్ ని నిద్రలేకుండా చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు తమిళ ఆర్టిస్ట్స్ ని కూడా వదలేట్లేదు అని కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.