టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన శ్రీ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో కాస్టింగ్ కౌచ్‌పై ఈ నటి పెదవి విప్పడంతో టాలీవుడ్లో కలకలం రేగాయి. ప్రముఖల పేర్లను వెల్లడించడంతో తీవ్ర దుమారం రేగింది. అంతేగాకుండా ఈ విషయంలో అర్ధనగ్నంగా నిలబడి తన నిరసన తెలిపిన శ్రీ రెడ్డి ప్రస్తుతం తమిళనాడుకు మకాం మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో మీ టూ సంచలనం సృష్టిస్తున్న వేళ తాజాగా శ్రీ రెడ్డి ఓ టీవీ ఛానెల్లో షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి వేధింపులకు పాల్పడ్డాడని శ్రీ రెడ్డి ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాక నిర్మాత బెల్లంకొండపై కూడా శ్రీ రెడ్డి పలు ఆరోపణలు గుప్పించింది.
జీవన్ రెడ్డి తనను చాలా సార్లు లైంగికంగా వేధించాడని ఆమె పేర్కొంది.
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి ఆరోపణలు విపక్షాలకు ఆయుధాలుగా మారనున్నాయి. ఎప్పుడూ గట్టిగా ధైర్యంగా టీఆర్ఎస్ తరపున పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే జీవన్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్, ఆర్మూర్ ప్రజల్లో అంశం చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అని కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి.
ఇదిలా ఉంటే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలామంది పేర్లు తనదగ్గర ఉన్నాయని శ్రీరెడ్డి చెప్పింది. అయితే శ్రీరెడ్డి జాబితాలో ఇంకెంతమంది రాజకీయనాయకులు ఉన్నారో అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా శ్రీరెడ్డి వ్యాఖ్యలు పెనుదుమారాన్నే రేపుతున్నాయి. ఆమె జాబితాలో ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారా ఇంకా చాలామంది నాయకులు ఉన్నారా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే మరో పక్క శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై ఇప్పటి దాకా ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు.