Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీరెడ్డి మొదలుపెట్టిన కాస్టింగ్ కౌచ్ వివాదం కాస్తా అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ మీడియా గా మారింది. దీంతో మొన్నటిదాకా టీవీ తెరల నిండా విరామమెరుగకుండా కనిపించిన శ్రీరెడ్డి..ప్రస్తుతం సోషల్ మీడియాకే పరిమితమయింది. మీడియాతో పవన్ ట్విట్టర్ వార్ స్టార్టయిన తర్వాత..ఆమె ఏ టీవీ చానళ్లలోనూ కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనే తన అభిప్రాయాలు వ్యక్తంచేస్తోంది. ఈ క్రమంలో ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.
తనకు ఏమన్నా అయితే మెగా ఫ్యామిలీదే బాద్యతని హెచ్చరించింది. మనసులో కక్ష ఉండి ఏం చేసినా వాళ్లదే బాధ్యతని, ఇది స్వయంగా తన స్వహస్తాలతో రాస్తోన్న తన వాంగ్మూలమని తెలిపింది. తన కెరీర్ గురించి, జీవితం గురించి భయపెడుతూ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించింది. మరో పోస్ట్ లో నేను అంతకుముందే చెప్పానుగా..నాలుగు కుటుంబాల గురించి…చూడండి నాగబాబు గారూ…సీనియర్ నటుడు అయిన మిమ్మల్ని నేను గౌరవిస్తా…కానీ మీ బెదిరింపులకూ, వార్నింగ్ లకూ భయపడేవాళ్లలో నేను లేను.
ఫిలిం ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీ సొత్తు కాదు…జులుం ప్రదర్శించకండి..అని వ్యాఖ్యానించింది. తన అర్ధనగ్న ప్రదర్శనకు ముందు కూడా ఓ బడా డైరెక్టర్ సెటిల్ మెంట్ కు ప్రయత్నించారని, అవసరమైతే పేరు కూడా బయటపెడతానని తెలిపింది. పోరాటంలో ప్రాణాలకు తెగించాం, మీ కరెన్సీ కట్టలు మీ దగ్గర పెట్టుకోండి. అమ్ముడు పోయే వాళ్లెవరో ప్రజలకు తెలుసు. మెగా ఫ్యామిలీ అర్ధం చేసుకుంటేచాలు. రెండువందల పిచ్చికామెంట్స్ ను మేము లెక్కచేయం.
కోట్ల మంది మనుషులతో మాకు పని. మా నిజాయితీ నిరూపించుకుంటాం. అమ్మాయిలను తక్కువ చేసినా, వాడుకోవాలని చూసినా, ఒక్కొక్కడి తోలు తీసి ఫిలింనగర్ మధ్యలో ఆరేస్తాం అని తన పోస్ట్ లో శ్రీరెడ్డి హెచ్చరించింది. మరో పోస్టులో శ్రీరెడ్డి వైసీపీ అధినేత జగన్ ని పొగుడుతూ….పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసింది. జగనన్నా..నీ ఉప్పు తిన్నందుకు విశ్వాసంతో చెబుతున్నా…అంటూ రౌడీ రాజకీయాలను చేసే వాళ్లను కలుపుకోవద్దని కోరింది. వైఎస్సార్ అన్నా, మీరన్నా…జనాల్లో విపరీతమైన అభిమానం ఉందన్నా..మీ ఫ్యాన్స్ ఎంత క్రమశిక్షణగా ఉంటారు?? ఎలాంటి బహిరంగ సభలు, ఓదార్పు యాత్రలు చేశారు ఎంతో శాంతంగా..??ఈ రోజు జగన్ తన అనుచరులని ఎవరిమీదకీ ఉసిగొల్పలేదు…దటీజ్ జగన్..శాంతి, ఓర్పు,సహనం వైఎస్ ఆయుధాలు. యువతకు ఆదర్శమూర్తి అని పేర్కొంది.