టాలీవుడ్‌లో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన శ్రీరెడ్డి స్టార్స్‌పై ఏ రేంజ్‌లో విరుచుకు పడినదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి కొత్త రంగును అద్దిన ఈమె అవతలి వ్యక్తి ఎవరు అనే విషయాన్ని ఏమాత్రం చూడకుండా తనకు తోచిన విధంగా మాట్లాడేస్తూనే ఉంటుంది. తెలుగులో ఈమె నోటికి ఎంతో మంది స్టార్స్ కూడా భయపడుతున్నారు. ఇప్పటికే ఈమె పలువురు జీవితాలను రోడ్డున పెట్టేసింది. ముఖ్యంగా సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్ మరియు హీరో నానిలపై శ్రీరెడ్డి కామెంట్స్ పీక్స్‌కు చేరాయి. తాజాగా తమిళనాట కూడా ఈమె వ్యాఖ్యలు దుమారంను రేపుతున్నాయి. ఇక ఈమె బయోపిక్‌ను తమిళంలో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తమిళంలో అల్లావుద్దీన్ అనే దర్శకుడు శ్రీరెడ్డి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ముందుకు వచ్చాడు. ఒక నిర్మాణ సంస్థ కూడా ఈ చిత్రంకు సాయంగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. శ్రీరెడ్డి బయోపిక్‌కు ‘రెడ్డి డైరీ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేయడం జరిగింది. తనను మోసం చేసిన ప్రతి ఒక్కరికి ‘రెడ్డి’ డైరీతో బుద్ది చెబుతాను అంటూ శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ చిత్రానికి నడిగర్ సంఘం సహకరిస్తుందని శ్రీరెడ్డి ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. త్వరలోనే తన బయోపిక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెళ్లడి చేస్తాను అంటూ ప్రకటించింది.