Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత ఏడాది సంక్రాంతికి ‘శతమానం భవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్తో దర్శకుడు సతీష్ వేగేశ్న ఆకట్టుకున్నాడు. ఆ సినిమాతో ఏకంగా పాపులర్ చిత్రంగా జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న శతమానం భవతి చిత్రం తర్వాత సతీష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఇటీవలే దిల్‌రాజు బ్యానర్లో నితిన్, రాశిఖన్నా జంటగా మొదలైన ఈ చిత్రం అప్పుడే ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతుంది. శరవేగంగా ఈ చిత్రాన్ని దర్శకుడు సతీష్ పూర్తి చేస్తున్నాడు. మొదటగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారేమో అని అంతా భావించారు. కాని సంక్రాంతి కాదు కదా ఏకంగా దసరా కంటే ముందే విడుదల చేయాలని నిర్ణయించారు.
నితిన్, రాశిఖన్నాలతో ప్రస్తుతం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలోనే పూర్తి చేసే యోచనలో దిల్‌రాజు అండ్ టీం ఉన్నట్లుగా తెలుస్తోంది. సతీష్ వేగేశ్న నుండి ఇంత ఫాస్ట్‌గా సినిమాను ఊహించలేదని సినీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సినిమాను జులై 24న విడుదల చేయాలని నిర్ణయించారు. నితిన్ ఇటీవలే ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లా పడటం జరిగింది. దాంతో ఈ చిత్రంపై నితిన్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. శర్వాకు శతమానంభవతిలా తనకు ఈ చిత్రం నిలుస్తుందని నితిన్ భావిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ లేదా మెగా హీరోతో దిల్‌రాజు నిర్మించాలని మొదట భావించాడు. కాని అది సాధ్యం కాకపోవడంతో నితిన్‌తో చేస్తున్నారు. ఈ చిత్రం మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.