ఇంతకీ ఈ డైరెక్టరూ పూర్తిగా మారిపోయాడంటారా…?

Srinu-Vaitla-Raviteja-Movie

తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీను వైట్ల తనదైన ఒక ప్రత్యేకతని చాటాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికి తెలుగు సినిమాల్లో హీరో వెళ్లి విలన్ ఇంట్లో తిష్ట వేసి, వాళ్ళని బఫున్లను చేయడం అనే టెంప్లేట్ శ్రీను వైట్లదే. అటువంటి శ్రీను వైట్ల కి పెద్ద హీరోలను డీల్ చేయలేడనే అపవాదు మెగాస్టార్ చిరంజీవితో చేసిన అందరివాడు, వెంకటేష్ తో చేసిన నమో వేంకటేశ అనే సినిమాలు కలిగించాయి. ఈ అపవాదుని కూడా దాటి జూ. ఎన్టీర్ తో బాద్ షా అనే సినిమా తీసి పర్లేదు అనిపించినా, ఆ తరువాత ఆగడు అంటూ మహేష్ బాబు కి, బ్రూస్ లీ అంటూ రామ్ చరణ్ కి, మిస్టర్ అంటూ వరుణ్ తేజ్ కి కెరీర్ బెస్ట్ ప్లాప్ సినిమాలు ఇచ్చాడు.

Amar-Akbar-Anthony-Teaser

అంతేకాక ఆ సినిమాల నిర్మాతలు మళ్ళీ కోలుకోలేనంత నష్టాలను రుచి చూపించాడు. ఇండస్ట్రీలో పరాజయాలు మామూలే అనుకుందామన్నా, శ్రీను వైట్ల ఇచ్చిన హ్యాట్రిక్ పరాజయాలు అలాంటి ఇలాంటి పరాజయాలు కాదాయే. ఇక శ్రీను వైట్ల పని ముగిసింది అనుకున్న క్షణంలో మళ్ళీ తన మిత్రుడు అయిన రవితేజ తో జతకట్టి అమర్ అక్బర్ ఆంథోనీ అనే సినిమాతో మల్లి తెరమీదకు వచ్చాడు మన శ్రీను వైట్ల. కాదనొద్దు శ్రీను వైట్ల-రవితేజ కాంబినేషన్ చాలా ముచ్చటైనదే. వీరి కాంబినేషన్లో వచ్చిన నీకోసం, వెంకీ, దుబాయ్ శీను సినిమాలు మంచి విజయాల్ని నమోదు చేశాయి. ఎటుకూడి ఇప్పుడొచ్చిన తంటా ఏంటయ్యా అంటే ఈసారి శ్రీను వైట్ల ఎలాంటి వంటకాన్ని వండి, వార్చాడా అనేదే అందరి మెదడులని తొలిచేస్తున్న విషయం. అందులోనూ ఈసారి ముగ్గురు రవితేజలని ఒకే స్క్రీన్ పైన చూపించడం అనేది ఇంకా సందేహాలు రేకెత్తిస్తున్న అంశం.

ravi-teja-amar-movie

అసలే మనోడికి అందరివాడు తో మెగా అభిమానులనుండి చీవాట్లు తిన్న అనుభవం కూడా ఉంది ఇద్దరు చిరంజీవి లను సరిగ్గా డీల్ చేయలేకపోయాడని. అవును…. అమర్ అక్బర్ ఆంథోనీ టీజర్ ఆసక్తి గానీ ఉంది, కానీ అందులో స్టైలిష్ మేకింగ్, నలుగురేసి స్టైలిష్ విలన్లు, మాఫియా థీమ్ తప్ప చూడగానే కట్టిపడేసే అంశం ఏది కనిపించలేదాయే. వరుణ్ తేజ తో తీసిన మిస్టర్ సినిమా టీజర్ చూసి కూడా తెలుగు ప్రేక్షకులు హమ్మయ్య, శ్రీను వైట్ల మారిపోయాడబ్బా, ఈసారి మంచి ప్రేమకథ చూపిస్తాడు అని ఆసక్తిగా సినిమా థియేటర్ లోకి వెళ్లిన వాళ్ళకి తన రొడ్డ కొట్టుడు సినిమాతో ఎన్ని చుక్కలు చూపించాడో అందరికి తెలిసిన విషయమే.

Srinu-Vaitla-Raviteja

మరి, ఇప్పుడు అమర్ అక్బర్ అంథోని సినిమాతో అయినా శ్రీను వైట్ల మారిపోయాడు అని సంబరపడి, ఆ సినిమా విడుదల రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఈసారి విందు భోజనం తినిపిస్తాడా లేదా అనేది సర్వత్రా నెలకొన్న సందేహం. ఈ సినిమా విడుదల తేదీ కూడా నవంబర్ 16 గా ఖరారు చేశారు. అప్పటివరకు ఆగితే ఆ సినిమా భవితవ్యం తో పాటు, శ్రీను వైట్ల భవిషత్తు కూడా తెలిసిపోతుంది.

amar akbar anthony very exacting