ఈసారి ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి…!

Srireddy Making Allegations On Telangana Leader Jeevan Reddy

ఇంతకాలం సినిమా పరిశ్రమకు చెందిన వారిపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా రాజకీయ నాయకుడిపై ఆరోపణలు చేసి రాజకీయ వర్గాల్లో కూడా సంచలనం సృష్టించింది. తాజాగా ఈమె ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తనను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి వేదించాడని పేర్కొంది. ఆర్మూర్‌ నియోజక వర్గంకు చెందిన ఈయన పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. ఇన్ని రోజులు కేవలం సినిమా పరిశ్రమ వారిపై వ్యాఖ్యలు చేయడంతో అంతా లైట్‌ తీసుకున్నారు. కాని ఇప్పుడు జీవన్‌ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ మరియు సినీ వర్గాల్లో చర్చకు తెరలేపుతున్నాయి.

sree-reddy-movies

లైంగికంగా ఎంతో మంది అమ్మాయిలను సినిమా పరిశ్రమ వారు వేదిస్తున్నారు. నేను పడ్డ ఇబ్బందులు మరెవ్వరు పడకూడదనే ఉద్దేశ్యంతో ఇలా మీడియా ముందుకు వచ్చినట్లుగా ఆమె పేర్కొంది. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డితో పాటు నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కూడా నన్ను లైంగికంగా వేదించాడు. ఆయన నన్ను చేసిన మోసం కూడా చాలా పెద్దదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతో మంది సినీ మరియు రాజకీయ ప్రముఖుల పేర్లు నావద్ద ఉన్నాయని, వాటన్నింటిని చెప్పే సమయం ఇది కాదని, త్వరలోనే అన్ని పేర్లు బయటకు తీసుకు వస్తానంటూ చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళంలో సినిమా చేస్తుంది. ఆ సినిమాలో నటిస్తూనే మరో వైపు ఆరోపణలను కంటిన్యూ చేస్తోంది. ముందు ముందు మరెంత మంది పేర్లు బయటకు వస్తాయో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

Sri Reddy Making Allegations On Telangana Leader Jeevan Reddy