కన్నడ స్టార్ హీరో అర్జున్ పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన శృతిహరిహరన్ ఇంకా వేడి చల్లారినట్లుగా లేదు. ఆమె మళ్లీ మళ్లీ అర్జున్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి అర్జున్ పై శృతి హరిహరన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమద్య ఒక కన్నడ దర్శకుడిపై సంజన లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆ దర్శకుడు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు అంటూ ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల నేపథ్యంలో దర్శకుల సంఘం ఆమెపై తీవ్రంగా స్పందించింది. పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేసిందని, వెంటనే క్షమాపణలు చెప్పకుంటే సినిమా పరిశ్రమ నుండి బహిష్కరిస్తామని ప్రకటించారు. దాంతో ఆమె తన లైంగిక వేదింపు ఆరోపణలు వెనక్కు తీసుకుని ఆమెకు క్షమాపణలు చెప్పడం జరిగింది.
సంజన క్షమాపణలు చెప్పడం గురించి శృతిహరిహరన్ స్పందిస్తూ ఆమెలా నేను పిరికి వ్యక్తిని కాదు. నాకు ప్రాణ హాని ఉందని తెలిసి కూడా నేను ఈ విషయమై పోరాడుతున్నాను అంది. తాజాగా బెంగళూరులో మహిళ కమీషన్ ముందు హాజరు అయిన ఆమె పు విషయాలను వారికి తెలియజేసింది. అర్జున్ లైంగికంగా వేదించాడు అంటూ తన వద్ద ఉన్న ఆరోపణలకు ఆమె సాక్షాధారాలను చూపించిందట. ఆసమయంలో మీడియా వారు ఆమెను చుట్టు ముట్టడంతో నేను చెక్కలా అయితే మీరు నాకు చీమల మాదిరిగా అనిపిస్తున్నారు అంటూ కామెంట్ చేసింది. చెక్కర చుట్టు చీమలు చేరినట్లుగా మీడియా వారు నా చుట్టు ఎక్కడికి వెళ్లినా చేరుతున్నారని ఆమె పేర్కొంది. ఆమె వ్యాఖ్యలపై మీడియా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.