టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఒక మల్టీస్టారర్‌ను ప్లాన్ చేయబోతున్నట్టుగా గతేడాది నుండి ప్రచారం జరుగుతోంది. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు తాజాగా పూర్తి అయినట్టు సమాచారం. నవంబర్ మొదటి వారంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిపి ఒక రెగ్యులర్ షూటింగ్‌ను మొదలెట్టబోతున్నారు. కాగా ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు కనిపించబోతున్నారు. అందులో ఒక ఫారిన్ అమ్మాయి కూడా దర్శణమివ్వనుంది. ఈ చిత్ర ఇంటర్వెల్ సీన్‌ను దాదాపు 45రోజుల పాటు తెరకెక్కించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
కేవలం 10 నిమిషాలకు అటు ఇటుగా ఉండే ఇంటర్వెల్ సీన్‌నే అంత ప్రటిష్మాత్మకంగా తెరకెక్కిస్తున్నాడంటే ఇక సినిమా మొత్తం ఏ రేంజ్‌లో ఉంటుదో ఊహించుకోవచ్చు. ఇంటర్వెల్ సీన్‌ని జక్కన్న చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని మూడువందల కోట్లతో భారీగా తెరకెక్కించనున్నారు. 2020 కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి రాజమౌళి ప్లాన్ చేశారు. అందుకు చెర్రీ, తారక్‌లు కూడా బల్క్ డేట్లను ఇచ్చారు. ఈ చిత్రంపై ప్రారంభానికి ముందు నుండే అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. పీరియాడిక్ చిత్రంగా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ చిత్ర థీమ్ ఏంటి అనేది ఊహించుకోలేం.