Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బ్యాడ్మింటన్, టెన్నిస్, కబడ్డీ వంటి క్రీడలకు ఆదరణ పెరుగుతున్నా.క్రికెట్ కు ఇండియాలో క్రేజ్ అణువంతైనా తగ్గలేదనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్.ఐపీఎల్ ప్రసార హక్కులకోసం స్టార్ఇండియా చెల్లించనున్న భారీ మొత్తం చూస్తే క్రికెట్ కు మనదేశంలో ఎంత ఆదరణ ఉందో అర్దమవుతుంది. ఆరంభం నుంచే సంచలనాలకు వేదిక అయిన ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ గతిని మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఒక్కోఏడుగడిచేకొద్దీ.ఐపీఎల్ కు మరింతగాక్రేజ్ పెరుగుతూ వస్తోంది.
ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ నేటి తరానికి తగ్గట్టుగా 40ఓవర్లలోఎలా ముగుస్తోందో.అంతే వేగంగా ఐపీఎల్ ఆదరణ పెంచుకుంది.వెలుగు జిలుగుల ఐపీఎల్ డిజిటల మీడియాలోనూ దుమ్మురేపుతోంది. ఏటా రెండు నెలలు పాటు సాగే ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు నిజంగా పండుగలాంటిదే.అందుకే ఐపీఎల్ను ప్రసారహక్కుల కోసం 14 మీడియా సంస్థలు పోటీపడ్డాయి. వారిలో అందరికన్నా ఎక్కువగా 16, 347.50 కోట్లు బిడ్ వేసిన స్టార్ ఇండియా ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. డిజిటల్ మీడియా హక్కులూ ఇందులో ఉన్నాయి.
2018 నుంచి 2022 వరకు ఐదేళ్లపాటు ఐపీఎల్ కు సంబంధించిన మీడియా, డిజిటల్ కార్యక్రమాలను స్టార్ ఇండియా ప్రసారం చేసుకునే వీలుందిరిలయన్స్ జియో, టైమ్స్ ఇంటర్ నెట్, ఎయిర్ టెల్, ఫేస్ బుక్ డిజిటల్, ఇంటర్నెట్ మాద్యమాల ద్వారా ప్రసార హక్కుల కోసం ఎక్కవ బిడ్ వేయగా, టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ, స్టార్ ఇండియా అధికంగా బిడ్ చేశాయి. చివరకు స్టార్ ఇండియా మీడియా, డిజిటల్ హక్కులు రెండింటినీ సొంతం చేసుకుంది. కొన్ని సంస్థాగత కారణాల వల్ల బామ్ టెక్, బెయిన్ స్పోర్ట్స్ సంస్థలను ఐపీఎల్ ప్రసారానికి అనర్హులుగా ప్రకటించారు. 2008లో ఐపీఎల్ ప్రారంభ సమయంలో జరిగిన వేలంలో రూ, 8,200కోట్లతో సోనీ పదేళ్లకాలానికి ప్రసార హక్కులను సొంతంచేసుకుంది.
మరిన్ని వార్తలు: