Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ లో మూడోరోజు డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టించింది. సినీ నటుడు సుబ్బరాజు విచారణ అంత సుదీర్ఘంగా సాగుతుందని ఎవరూ అనుకోలేదు. ఓవైపు ఆయన సహకరిస్తున్నాడని చెబుతూనే.. అంత టైమ్ ఎందుకు ఉంచారనేది ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో గుబులు రేపుతోంది. దీనికి తోడు ఓ సినీ ఫ్యామిలీకి డ్రగ్స్ లింకుల్ని సుబ్బరాజు చెప్పాడన్న వార్త హల్చల్ చేస్తోంది.
కానీ సుబ్బరాజు పోలీసులకు సహకరించి ఉండకపోవచ్చన్న సమాచారం వస్తోంది. ఎందుకంటే ఏ కేసులో అయినా.. నిందితులు విచారణ అధికారులకు సహకరిస్తే.. త్వరగా పనైపోతుంది. కానీ సుబ్బరాజు మొండిగా వ్యవహరించడం వల్లే.. బాగా లేటుగా పంపించి ఉంటారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఇక అధికారులకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం మైండ్ గేమ్ మాత్రమే.
సుబ్బరాజు కీలక విషయాలు చెప్పేశాడని, మిగతా వారూ అలాగే చెప్పాలని వాళ్లంటున్నారు. అన్నీ చెప్పేస్తే.. ఇక మిగిలినవారికి చెప్పడానికి ఏం మిగులుతుందనేది మరో ప్రశ్న. మొత్తం మీద సిట్ అధికారులు మరోసారి తమ మార్క్ మైండ్ గేమ్ తో టాలీవుడ్ ని షేక్ చేస్తున్నారు. ఓవైపు అకున్ సభర్వాల్, మరోవైపు చంద్రవదన్ ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు.
మరిన్ని వార్తలు
జగన్ పాదయాత్ర ఆగిపోతుందా.?