Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైవిధ్య భరిత చిత్రాలతో కెరీర్ లో ముందుకెళ్తున్నాడు యువ హీరో శర్వానంద్. తొలి సినిమా నుంచి ఆయన భిన్నమైన పాత్రల్లోనే కనిపిస్తున్నారు. క్లాస్, మాస్ అన్న ఇమేజ్ కు పరిమితం కాకుండా చిత్రాలను ఎంచుకుంటున్నారు. వెన్నెల, గమ్యం, ప్రస్థానం, అందరి బంధువయా, జర్నీ, రన్ రాజా రన్ , శతమానం భవతి వంటి సినిమాలన్నీ దేనికవే భిన్నమైనవి. ఇటీవల రాధ చిత్రంలో పోలీస్ గా మాస్ గెటప్ లో కనిపించిన శర్వానంద్ మారుతి దర్శకత్వంలో వస్తున్న మహానుభావుడులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా క్లాస్ హీరో గా అలరించనున్నాడు. సెప్టెంబరులో మహానుభావుడు దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమాలో ఆయన మాఫియా డాన్ గా కనిపించనున్నాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమా గతంలో కమల్ హాసన్ నటించిన నాయకుడు చిత్రాన్ని పోలిఉంటుందని సమాచారం. సినిమాలో ఇంకా హీరోయిన్ ను ఎంపికచేయలేదు. ప్రస్తుతం మహానుభావుడుతో బిజీగా ఉన్న శర్వానంద్ ఈ చిత్రం పూర్తయిన తరువాత కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. మహానుభావుడులో అతిశుభ్రం అనే డిజార్డర్ తో ఉండే సాప్ట్ వేర్ ఇంజనీర్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు శర్వానంద్. వినాయక చవితి సందర్భంగా రిలీజైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. మారుతి, నాని కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని మించి మహానుభావుడు విజయాన్ని సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరిన్ని వార్తలు: