మరో మార్గం లేక, మామకు పోటీ..!

sumanth and nagarjuna

అక్కినేని నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’ చిత్రాన్ని సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి అయిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, పాటను విడుదల చేయడం జరిగింది. టీజర్‌ సినిమాపై ఆసక్తిని కలిగించే విధంగా ఉంది అంటూ అభిమానులు అంటున్నారు. నాగార్జున, నాని కాంబో అవ్వడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రంను తెరకెక్కించినట్లుగా దర్శకుడు శ్రీరామ్‌ ఆధిత్య చెబుతున్నాడు. ఇక ఈ చిత్రంకు పోటీగా స్వయంగా అక్కినేని హీరో సుమంత్‌ రంగంలోకి దిగడం అక్కినేని అభిమానులకు రుచించడం లేదు.

nagarjuna and sumanth movies release

సుమంత్‌ హీరోగా తెరకెక్కిన ‘ఇదం జగత్‌’ చిత్రంను ఈనెల 28న విడుదల చేయబోతున్నారు. అంటే నాగార్జున చిత్రం విడుదలైన తెల్లారే ఆయన మేనల్లుడు సుమంత్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదే డేట్‌కు రావడం తప్పడం లేదని, ఆ తర్వాత ఇతర చిత్రాలు వరుసగా విడుదల కాబోతున్న కారణంగా అక్టోబర్‌ మొత్తం ఖాళీ లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సెప్టెంబర్‌ 28న విడుదల చేస్తున్నట్లుగా సుమంత్‌ చెప్పుకొచ్చాడు. మీడియా నేపథ్యంలో తెరకెక్కిన ‘ఇదం జగత్‌’ ట్రైలర్‌ ప్రేక్షకులను అలరించింది. సినీ వర్గాల వారిని ఆలోచింపజేసింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈచిత్రం నాగార్జున మూవీకి పోటీని ఇస్తుందా అనేది చూడాలి.