Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఇండియాలో సెటిల్ అయ్యింది. ఈ అమ్మడు వరుసగా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ స్టార్‌గా దూసుకు పోతుంది. భర్త డానియోల్తో పాటు ముంబయిలో మకాం పెట్టిన సన్నీలియోన్ ఇటీవల తల్లి అయిన విషయం తెల్సిందే. తల్లి అంటే సహజ పద్దతిలో కాకుండా దత్తత ద్వారా సన్నీలియోన్ తల్లి అయ్యింది. ఒక పాపను దత్తత తీసుకుని పెంచుకోవాలని నిర్ణయించుకున్న సన్నీలియోన్ దంపతుల నిర్ణయాన్ని అంతా కూడా అభినందిస్తున్నారు. ఈ సమయంలోనే సన్నీలియోన్ దత్తత తీసుకున్న పాప గురించి జాతీయ మీడియాలో ఒక ఆసక్తికర కథనం వెలువడుతుంది.
సన్నీలియోన్ దంపతులు మహారాష్ట్రలోని లాతూరులోని ఒక అనాధ ఆశ్రమంలో నిషా అనే పాపను దత్తత తీసుకున్నారు. ఆ 22 నెలల పాపను 11 మంది జంటలు తిరష్కరించారు. లాతూర్ అనాధ ఆశ్రమం నిర్వాహకులు తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ నిషాను 11 మందికి చూపించాం. కాని నల్లగా ఉందనే కారణంతో వారు తిరష్కరించడం జరిగింది. కాని సన్నీలియోన్ మాత్రం నిషా కలర్ గురించి పట్టించుకోకుండా తీసుకున్నారు అని ఆయన చెప్పుకొచ్చాడు. తమ కలర్‌కు పూర్తి విరుద్దంగా ఉన్నా కూడా నిషాను సన్నీలియోన్ దంపతులు తీసుకోవడం అభినందనీయం. ప్రస్తుతం సన్నీలియోన్ ఒడిలో ఆ పాప హాయిగా జీవితాన్ని సాగిస్తుంది.
మరిన్ని వార్తలు: