Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అందరూ వద్దన్నా మొండిగా ముందుకెళ్లడం. తర్వాత తీరిగ్గా కోర్టులతో మొట్టికాయలు వేయించుకోవడం మోడీ సర్కారుకు అలవాటైపోయింది. పశువధపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నిలబడదని చాలా రాజకీయా పార్టీలు చెప్పాయి. తామూ ఇలాంటివి ట్రై చేశామని, కానీ రాజ్యాంగం ఒప్పుకోదని కొంతమంది నోరు జారారు కూడా. అయినా సరే మోడీ మొండిగా ఆర్డినెన్స్ తెచ్చారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు నాలిక మడతేశారు.
అసలు ఓ మనిషి ఏం తినాలో డిసైడ్ చేయడానికి మీరెవరని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కడిగేసింది. రాజ్యాంగం ప్రకారం జీవించే స్వేచ్ఛ అందరికీ ఉందని, ఇష్టమైన ఆహారం తినడం ఆ హక్కులో భాగమని అత్యున్నత న్యాయస్థఆనం తలంటింది. దీంతో కేంద్రం పశువుల్ని అక్రమంగా వధించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని సమర్థించింది. కానీ ఈ విషయంలో మరింత మెరుగైన నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడంతో.. రూల్స్ మార్చే విషయం పరిశీలిస్తున్నామని కేంద్రం చెప్పింది.
అదే జరిగితే కేంద్రం వెనకడుగు వేసినట్లే అంటున్నాయి విపక్షాలు. కానీ ఇప్పుడు అది తప్ప వేరే మార్గం లేదు. కేంద్రం ఆ పని చేయకపోతే.. కోర్టే జోక్యం చేసుకుని రూల్స్ మారుస్తుంది. అప్పుడు ఇంకా పరువు పోతుంది. అందుకే గౌరవంగా ముందే మార్పులు చేయాలని న్యాయనిపుణులు సలహా ఇస్తున్నారట. కానీ మోడీ మాత్రం ఆలోచిస్తున్నారట. ఎంత యోచించినా ఇంతకు మించిన సొల్యూషన్ లేదనేది ప్రభుత్వ వర్గాల మాట. అందుకే కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలని సీనియర్లు నసుగుతున్నారు.
మరిన్ని వార్తలు: