Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా సంచలన వాస్తవాలను బయట పెడుతూ అందరికి షాక్ ఇస్తుంది. తాజాగా టాలీవుడ్‌కే పెద్ద దిక్కు అయిన దగ్గుబాటి కుటుంబంకు చెందిన అభిరామ్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. సురేష్‌బాబు తనయుడు అభిరామ్ తనను పలు సార్లు వాడుకున్నాడని, సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తాను అంటూ ఆయన తనను లైంగికంగా వేదించాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా లీక్ చేయడంతో ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో కూడా ఒక్కటే చర్చ జరుగుతుంది. అదే దీనిపై సురేష్‌బాబు రియాక్షన్ ఏంటీ?
సురేష్‌బాబు ఇప్పటి వరకు ఈ విషయమై మీడియా ముందుకు రాలేదు. ఆయన తన కొడుకును వెనకేసుకు వస్తాడా లేదా సమర్ధిస్తాడా అంటూ మహిళ సంఘాల వారు ప్రశ్నిస్తున్నారు. మీడియా వారికి కూడా సురేష్‌బాబు అందుబాటులో లేకుండా ఉన్నాడు. ఆ కుటుంబంకు చెందిన ఎవ్వరు కూడా శ్రీరెడ్డి విషయంలో మాట్లాడేందుకు ఆసక్తి చూపండం లేదు. శ్రీరెడ్డి ఆరోపణలపై సినీ వర్గాల వారు మరియు సురేష్‌బాబుకు సన్నిహితంగా ఉండే వారు కూడా నోరు మెదపడం లేదు. ఇక శ్రీరెడ్డికి మా సభ్యత్వం ఇవ్వమంటూ ప్రకటించిన వారు కూడా ఈ విషయంలో ఆచి తూచి మాట్లాడుతూ ఆయన మా సభ్యుడు కాదు అంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయంలో అంతా సైలెంట్‌గా ఉంటున్న కారణంగా విషయం మరుగున పడిపోయే అవకాశం ఉంది.