Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌లోనే కాకుండా అన్ని వుడ్‌లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని, అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న అమ్మాయిలను వాడుకునేందుకు అన్ని భాషల్లోని సినీ దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఇటీవల పలువురు మాజీ హీరోయిన్స్, ప్రస్తుత హీరోయిన్స్ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారికి ఇలాంటి పరిస్థితి తప్పదని, అయితే అందరు కూడా అలా అవకాశాలు తెచ్చుకున్న వారిగా పరిగణించవద్దని కలర్స్ స్వాతి చెప్పుకొచ్చింది.
తాజాగా ఈ అమ్మడు నటించిన ‘లండన్ బాఋ’ విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ… కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల ఇండస్ట్రీలో ఉందని తాను నమ్ముతాను అని, అలా అని దర్శకులు, నిర్మాతలను తప్పుబట్టను అంటూ చెప్పుకొచ్చింది. ఎవరైతే అవకాశాల కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకుంటారో అలాంటి వారికే ఈ పరిస్థితి ఎదురవుతుందని, కొందరు కాస్టింగ్ కౌచ్‌కు బలి కాకుండా కూడా అవకాశాలు దక్కించుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. తాను ఎప్పుడు అవకాశాలు ఎవరిని అడగలేదని, తన వద్దకు వచ్చిన అవకాశాలను మాత్రమే వినియోగించుకుని నటిస్తూ ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. అవకాశాలు అడిగినప్పుడు అలా చేయక తప్పదని, చేసినప్పుడే అడిగిన అవకాశం వస్తుందని స్వాతి నిర్మొహమాటంగా కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పేసింది.