తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం కాస్టింగ్ కౌచ్. తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా దాదాపు అన్ని పరిశ్రమలో కూడా కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన శ్రీరెడ్డి ఇంకా కొందరు మహిళ సంఘాలతో కలిసి పోరాటం కూడా చేస్తున్నారు. ఈ విషయమై బాధ్యతయుతంగా స్పందించాల్సిన తెలంగాణ సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వింతగా స్పందించడం జరిగింది. ఇదో పనికిరాని విషయం అంటూ ఆయన మాట్లాడటం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ అనేది ఒక చిన్న విషయం అని, ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉండగా, ఇదే ప్రపంచ సమస్య అన్నట్లుగా ప్రవర్తించడం ఏంటంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గురించి చర్చ అనవసరం అని, సీరియస్ ఇష్యూ అయితే తప్పకుండా నేను స్పందిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతమంది కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ సమయంలో మంత్రి ఇలా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం అవుతుంది. సోషల్ మీడియాలోనే కాకుండా కాస్టింగ్ కౌచ్ గురించి పలువురు హీరోయిన్స్ కూడా ఆగ్రహంతో ఉన్నారు. అయినా మంత్రి మాత్రం ఇదో చిన్న సమస్య అన్నట్లుగా చూస్తున్నాడు.