Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ చిత్రంలో కట్టప్పగా నటించి మెప్పించిన తమిళ నటుడు సత్యరాజ్ కూతురు దివ్యను చంపేస్తామని బెందిరింపులు వస్తున్నాయట. ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సత్యరాజ్ కూతురు దివ్య వృతి రీత్యా డాక్టర్. ఆమె చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమెను ఇటీవల కొందరు తమ మెడిసిన్ పేషంటర్లకు రాయాల్సిందిగా కోరుతూ ఆమె వద్దకు వచ్చారట. అయితే నిషేదిత మందులను తాను ఎందుకు పేషంట్లకు ఇవ్వాలి అంటూ ఆమె ప్రశ్నించడంతో వారు భారీ మొత్తంను లంచంగా ఆఫర్ చేశారు. అయినా కూడా ఆమె నో చెప్పింది.
తమ మందులను రాయనందుకు గాను ఆమెను చంపేస్తామంటూ నకిలీ మందుల తయారు చేసే మాఫియా వారు బెదిరిస్తున్నారు. దాంతో పోలీసులను ఆశ్రయించిన దివ్యకు పోలీసులు భద్రత కల్పించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వౌరీ చేస్తున్నారు. నకిలీ మందులు, నిషేదిత మందులు సరఫరా చేస్తున్న పెద్ద ముఠా ఉన్నట్లుగా దివ్య కేసు ద్వారా పోలీసులు గుర్తించారు. దివ్యతో పాటు కుటుంబ సభ్యులు అందరికి కూడా పోలీసులు భద్రత కల్పించారు. కట్టప్ప పాత్రతో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న సత్యరాజ్ కూతురు ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.
మరిన్ని వార్తలు