ఓ నటుడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమై ఎంత కాలమైనా పిల్లలు పుట్టడం లేదనే బాధ ఒక వైపు, పిల్లలు కలగకపోవడానికి నీలోనే లోపం ఉందని భర్త మాటలు ఒక వైపు ఆమె మెదడును తోలిచేస్తుండగా మనస్తాపంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే, యాగవరాయనుమ్, నాకాక్క తదితర చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్, స్మిరిజ దంపతులు.
వీరికి వివాహమై మూడు సంవత్సరాలు గడిచినా పిల్లలు కలుగలేదు. పిల్లల విషయంలో లోపం నీలో ఉందంటే, నీలో ఉందంటూ, ఇద్దరూ తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన భార్యను తీసుకుని హోటల్‌కు వెళ్లి భోజనం చేసి వచ్చిన సిద్ధార్థ్, ఇంటికి వచ్చిన తరువాత ఆమెతో మరోసారి గొడవపడ్డాడు. దీంతో బెడ్ రూమ్ లోకి వెళ్ళిన ఆమె తలుపు వేసుకుంది. ఎప్పుడు గొడవ జరిగినా అంతే కదా అని భావించిన సిద్దార్థ్ సోఫాలో పడుకున్నాడు. ఉదయం తొమ్మిదైనా తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుండి చూస్తే ఉరి వేసుకుని కనిపించింది. దీంతో సిద్దర్త్బ్ మధురవాయిల్ పోలీసులకు సమాచారాన్ని అందించాడు. పోలీసులు రంగంలోకి దిగి తలుపులు పగులకొట్టగా సిర్మిజా లోపల ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.