తమిళ స్టార్ హీరో సూర్యతో సుధ కొంగర ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో వెంకటేష్ నటిస్తున్నట్లుగా మొదటి నుండి వార్తలు వచ్చాయి. కాని తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో వెంకటేష్ కాకుండా విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. సూర్య మరియు విజయ్ దేవరకొండల కాంబినేషన్లో ఈ మల్టీస్టారర్ రూపొందబోతుంది. మొదట వెంకటేష్ అనుకున్నప్పటికి స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో ఆ పాత్రకు విజయ్ దేవరకొండ అయితే బాగుంటాడని దర్శకురాలు సుధ భావిస్తోంది.
సూర్య తెలుగులో మొదటి సారి నటించబోతున్న కారణంగా ఈ చిత్రంపై ఎక్కువ ఫోకస్ ఉంది. అందుకే స్క్రిప్ట్ విషయంలో మరియు ఇతర విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. త్వరలోనే సినిమాలో విజయ్ దేవరకొండ ఉన్నాడా లేడా అనే విషయమై క్లారిటీ వచ్చేచ అవకాశం ఉంది. త్వరలో నోటా చిత్రంతో విజయ్ దేవరకొండ ఇటు తెలుగు మరియు అటు తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నోటా సక్సెస్ అయితే సూర్యతో విజయ్ దేవరకొండ నటిస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయం అంటున్నారు.